Share News

బీజేపీ శ్రేణుల సంబరాలు

ABN , Publish Date - Jan 17 , 2026 | 12:26 AM

మహారాష్ట్ర మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడంతో ఆ పార్టీ నాయకులు వేములవాడలో సంబరాలు జరుపుకున్నారు.

బీజేపీ శ్రేణుల సంబరాలు

వేములవాడ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడంతో ఆ పార్టీ నాయకులు వేములవాడలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో తిప్పాపూర్‌ తెలంగాణ తల్లి చౌరస్తాలో టపాసులు పేల్చుతూ, స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపు కున్నారు. స్థానికంగా నిర్వహించే మున్సిపల్‌ ఎన్నికల్లో సైతం బీజేపీ మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి, జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ నాయకులు చెన్నమనేని వికాస్‌రావు, ఎర్రం మహేష్‌, కుమ్మ రి శంకర్‌, రాపెల్లి శ్రీధర్‌, కోల కృష్ణస్వామి, శ్రీనివాస్‌, శేఖర్‌, మల్లేశం యాదవ్‌ తదితరులు ఉన్నారు.

ఇల్లంతకుంట : మండలకేంద్రంలోని బస్టాండ్‌ ప్రాంతంలో బీజేపీ నాయకులు టపాసులు కాల్చి ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేశారు. మండలశాఖ అధ్యక్షుడు భూమల్ల అనీల్‌కుమార్‌, సీనియర్‌ నాయకులు బత్తిని సాయగౌడ్‌, మ్యాకల మల్లేశం, అసెంబ్లీ కోకన్వీనర్‌ బత్తిని స్వామి, నాయకులు పినికాశి అనీల్‌, దూది సుధీర్‌రెడ్డి, కమలాకర్‌రావు, గోపాల్‌, బాలరాజు, బెంద్రం రాజు, వేణులతో పాటు వివిద గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

సిరిసిల్ల రూరల్‌ : సిరిసిల్ల పట్టణంలో శుక్రవారం బీజేపీ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌, కరీంనగర్‌ పార్లమెంటరీ కో-కన్వీనర్‌ అడెపు రవీందర్‌, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నే హరీష, కర్నే రేవంత్‌, మోర రవి, శేఖర్‌, అంకారపు రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2026 | 12:26 AM