రాజీ మార్గంతో కేసులను పరిష్కరించుకోవాలి
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:19 AM
కోర్టులల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ మార్గంతోనే పరిష్కరించుకుని ఖర్చులను తగ్గిం చుకోవాలని, తద్వారా దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియ నుంచి ఉపశమనం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి, నీరజ అన్నారు.
సిరిసిల్ల అర్బన్, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : కోర్టులల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ మార్గంతోనే పరిష్కరించుకుని ఖర్చులను తగ్గిం చుకోవాలని, తద్వారా దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియ నుంచి ఉపశమనం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి, నీరజ అన్నారు. సిరిసిల్ల జిల్లా కోర్టులో బుధవా రం ఈనెల 18న నిర్వహించే స్పెషల్‌లోక్ అదాలత్‌పై జిల్లా న్యాయవా దులు, బ్యాంకర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అదేశాల మేరకు నేగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ కేసు లను త్వరగా పరిష్కారం కోసం ప్రత్యేక లోక్ అదాలత్‌ను ఈనెల 18వ తేదీతో పాటు నవంబర్ 11న నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా పరిధిలోని ఎన్‌ఐ యాక్ట్ (చెక్ బౌన్స్) కేసులలోని ఫిర్యాదుదారు లు, ప్రత్యర్థులు, బ్యాంకులు, అర్దిక సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, న్యాయ వాదులు సంబంధిత కక్షిదారులు ఈ ప్రత్యేక లోక్‌అదాలత్‌ను సద్విని యోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీని యర్ సివిల్ జడ్జీ పి లక్ష్మణాచారి, జూనియర్ సివిల్ జడ్జీ మేఘన, వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిట్టల మనోహార్, సిరిసిల్ల బార్ అసోషియేషన్ కార్యదర్శి వెంకటయ్య, న్యాయవాదులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.