రాజీ మార్గమే రాజ మార్గం
ABN , Publish Date - Mar 29 , 2026 | 12:44 AM
రాజీ మార్గమే రాజ మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి పేర్కొన్నారు.
ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి
ఫ మెగా లోక్ అదాలత్‌లో 3034 కేసుల పరిష్కారం
జగిత్యాల టౌన్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రాజీ మార్గమే రాజ మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి పేర్కొన్నారు. కేసుల పేరుతో యేళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృథా చేసుకోకుండా రాజీ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లా కోర్టులో శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి మాట్లాడుతూ జాతీయ మెగా లోక్ అదాలత్‌లో సమిష్టి కృషితో 3034 కేసులు పరిష్కారం అయినట్లు తెలిపారు. ఇందులో సివిల్ 37, క్రిమినల్ 2473, ఫ్రీ లిటిగేషన్ కేసులు 524 పరిష్కారం అయ్యాయన్నారు. 10 మోటర్ యాక్ట్ సంబంధించిన కేసులు పరిష్కారం కాగా వాటికి సంబంధించి రూ.69,05,000 నష్ట పరిహారం చెల్లించినట్లు తెలిపారు. ముగ్గురు దంపతులకు సంబంధించిన కేసులలో రాజీ కుదరగా న్యాయమూర్తుల సమక్షంలో వారు మళ్లీ పూల దండలు మార్చుకొని ఏకమయ్యారు. ఈ సందర్భంగా వివిధ కారణాలతో తల్లిని కోల్పోయి, కొందరు తండ్రిని కోల్పోయి అనాఽఽథలుగా మారిన ముగ్గురు బాలికలను జిల్లా బాలల సంరక్షణ విభాగ్ మిషన్ వాత్సల్యలో భాగంగా వారికి పునరావాస చర్యలు చేపట్టి పలు కస్తూర్బా పాఠశాలల్లో చేర్పించినట్లు తెలిపారు. కార్యక్ర మంలో జిల్లా మొదటి అదనపు జడ్జి నారాయణ, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి వెంకట మల్లిక్ సుబ్రమణ్య శర్మ, ప్రిన్సిపల్ జూని యర్ సివిల్ జడ్జి లావణ్య, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి నిఖిష, బార్ అసోసి యేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరాములు, న్యాయవాదులు, అధికారులు పాల్గొన్నారు.