Share News

అలరిస్తున్న రోబో మూషికం

ABN , Publish Date - Sep 20 , 2026 | 01:01 AM

కరీంనగర్‌ రాంనగర్‌ ఛాలెంజర్‌ యూత్‌ గణేశ్‌ మండపం వద్ద ఏర్పాటు చేసిన రోబో మూషికం అందరినీ అలరిస్తోంది.

అలరిస్తున్న రోబో మూషికం

కరీంనగర్‌ కల్చరల్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ రాంనగర్‌ ఛాలెంజర్‌ యూత్‌ గణేశ్‌ మండపం వద్ద ఏర్పాటు చేసిన రోబో మూషికం అందరినీ అలరిస్తోంది. చిన్నారులు, యువత, పెద్దలు రోబోటిక్‌ మూషికతో సరదాగా గడుపుతూ ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఈ మండపం వద్ద ప్రతిరోజు నిర్వహిస్తున్న గంగా హారతిలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొంటున్నారు. సీపీ గౌస్‌ ఆలం వినాయకుడిని దర్శించుకున్నారు. రోబో మూషికానికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పోరేటర్‌ గాజ రమ, యూత్‌ బాధ్యులు రేవంత్‌రెడ్డి వంశి, మారుతి, వేంకటేశం, పూర్ణచందర్‌రావు, రజనీకాంత్‌, నాగరాజు, రాజేందర్‌, గణేశ్‌, సాయి పాల్గొన్నారు.

----------------------------------------

Updated Date - Sep 20 , 2026 | 01:01 AM