అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి
ABN , Publish Date - Jan 11 , 2026 | 12:29 AM
రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపి అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని బీజేపి పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి గంగారెడ్డి మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
వేములవాడ, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపి అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని బీజేపి పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి గంగారెడ్డి మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోని పద్మశాలి సంఘంలో బీజేపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపితో కలిసి బీజేపి ముఖ్య నాయకులతో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్‌రెడ్డి, గోపి మాట్లాడుతూ వేములవాడ మున్సి పల్‌పై బీజేపీ జెండాను ఎగరవేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. వేములవాడ పట్టణాన్ని, రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పేరుతో ఎక్కడి కక్కడి విప్పి పెట్టారని, పనులు ఎక్కడ జరగడం లేదని అన్నారు. శివరాత్రికి రాజన్న దర్శనం భక్తులకు కల్పించాలని అన్నారు. మహా శివరాత్రి దగ్గరలోనే ఉందని భక్తులకు రాజన్న దర్శనం కల్పించకపోతే ఊరుకునేది లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎప్ప టికప్పుడు ఎండగట్టాలని అన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ వేములవాడ పట్టణ ప్రజలు తాగునీ రుకు ఇబ్బంది పడుతున్న సమయంలో తాగునీరు సమస్య లేకుండా చేసిన ఘనత బీజేపీకి దక్కుతుందని అన్నారు. ప్రజలకు తాగునీరు అందించేందుకు ఆకాశ గంగా పేరుతో ఇంటింటికి తాగునీరు అందించా మని గుర్తు చేశారు. రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని, పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నేత చెన్నమనేని వికాస్‌రావు, పట్టణ అధ్యక్షు డు రాపెల్లి శ్రీధర్, రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంక ర్ నాయకులు శ్రీనివాస్, సంటి మహేష్, రేగుల సంతోష్‌బాబు, గడ్డమీ ద శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.