ప్రచార హోరు
ABN , Publish Date - Feb 07 , 2026 | 01:23 AM
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా హుజూరాబాద్ మున్సిపాలిటీలోని వార్డులు రాజకీయ నాయకుల ప్రచారాలతో హోరెత్తుతున్నాయి. ప్రచారాల్లో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, నాయకులు, ఇన్‌చార్జీలు వార్డుల్లో ర్యాలీలు, ప్రచారాల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఒకే రోడ్డు, వీధుల్లో ఒక పార్టీ తర్వాత మరో పార్టీల ర్యాలీలు జరుగుతున్నాయి. ప్రతి వార్డులో వారికి సంబంధించిన అభ్యర్థుల ఆటోలు, ట్రాలీలలో మైకులు పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు.
- హామీల వర్షం కురిపిస్తున్న అభ్యర్థులు
- సందడిగా వార్డులు
హుజూరాబాద్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా హుజూరాబాద్ మున్సిపాలిటీలోని వార్డులు రాజకీయ నాయకుల ప్రచారాలతో హోరెత్తుతున్నాయి. ప్రచారాల్లో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, నాయకులు, ఇన్‌చార్జీలు వార్డుల్లో ర్యాలీలు, ప్రచారాల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఒకే రోడ్డు, వీధుల్లో ఒక పార్టీ తర్వాత మరో పార్టీల ర్యాలీలు జరుగుతున్నాయి. ప్రతి వార్డులో వారికి సంబంధించిన అభ్యర్థుల ఆటోలు, ట్రాలీలలో మైకులు పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. వారు గతంలో చేసిన అభివృద్ధి పనులను, ప్రస్తుతం గెలిస్తే చేయనున్న పనులను రికార్డింగ్ చేయించి మైకులతో హోరెత్తిస్తున్నారు. మరికొంత మంది ఇంటింటికి తిరుగుతూ కరపత్రాల పంపిణీ, గోడలకు అతికిస్తున్నారు. వీటితో పాటుగా ఆయా పార్టీల అగ్రనాయకులు ప్రచారాలకు వస్తే తమ బలాన్ని చూపించడానికి ఒక్కొక్కరికి రూ.200 నుంచి రూ. 300 ఇచ్చి ప్రజలను తీసుకువచ్చి కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. హుజూరాబాద్ మున్సిపాలిటీలో మరో మూడు రోజులు ఎన్నికల పండుగ వాతావరణం కనిపించనుంది. అయితే కొన్ని వార్డుల్లో త్రిముఖ పోటీ ఉండగా, మిగతా వార్డుల్లో నాలుగు నుంచి 10మంది వరకు పోటీలో ఉన్నారు. వారంతా ఒకరి తర్వాత మరొకరు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు.