Share News

ఇల్లందకుంటలో ప్రచార రథం ప్రారంభం

ABN , Publish Date - Mar 23 , 2026 | 12:07 AM

మండలకేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ నెల 25 నుంచి ఏప్రిల్‌ 6 వరకు జరిగే బ్రహ్మోత్సవాల ప్రచార రథాన్ని ఆలయ చైర్మన్‌ ఇంగిలే రామారావు ఆదివారం ప్రారంభించారు.

ఇల్లందకుంటలో ప్రచార రథం ప్రారంభం
ఇల్లందకుంటలో ప్రచార రథాలను ప్రారంభిస్తున్న చైర్మన్‌ రామారావు

ఇల్లందకుంట, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ నెల 25 నుంచి ఏప్రిల్‌ 6 వరకు జరిగే బ్రహ్మోత్సవాల ప్రచార రథాన్ని ఆలయ చైర్మన్‌ ఇంగిలే రామారావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ రామారావు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సుధాకర్‌, అర్చకులు శేషం వంశీధరచార్యులు, ధర్మకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 12:07 AM