Share News

అభివృద్ధి పనులకు మళ్లీ టెండర్లు పిలవండి

ABN , Publish Date - Apr 04 , 2026 | 12:19 AM

పట్టణంలోని అభివృద్ధి పనులకు కొన్ని ప్యాకేజీలకు రాకపోతే కొద్దిపాటి మార్పులు చేసి మళ్లీ టెండర్లు పిలవాలని మున్సిపల్‌ అధికారు లకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ సూచించారు.

అభివృద్ధి పనులకు మళ్లీ టెండర్లు పిలవండి
మున్సిపల్‌ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన వాణి

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌

జగిత్యాల టౌన, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని అభివృద్ధి పనులకు కొన్ని ప్యాకేజీలకు రాకపోతే కొద్దిపాటి మార్పులు చేసి మళ్లీ టెండర్లు పిలవాలని మున్సిపల్‌ అధికారు లకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ సూచించారు. జగిత్యాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్‌ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో యూఐడీఎఫ్‌ నిధులు రూ. 50 కోట్ల రూపాయలు, 12.5 రాష్ట్ర నిధులకు ఎనిమిది ప్యాకేజీలుగా విభజించి టెండర్లు నిర్వహించగా అందులో కొన్ని పనులకు కాట్రాక్టర్లు రాకపోతే కొద్దిపాటి మార్పులు చేసి మళ్లీ టెండర్లు పిలవాలని సూచించారు. సోమవారం సీడీఎం ఏ ఇంజనీర్‌ ఇన చీఫ్‌ అపాయింట్మెంట్‌ తీసుకు న్నామని, జగిత్యాల పట్టణ అభివృద్ధి పనులు, టౌన ప్లానింగ్‌పై పలు వినతులు అందజేయ నున్నట్లు తెలిపారు. పట్టణంలో ప్రధాన వీధులు, రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేయడానికి, పట్ట ణానికి సంబంధించిన టౌన ప్లానింగ్‌ అసెస్మెంట్‌, ఇంటి నంబర్‌ విషయంలో ఇబ్బంది లేకుం డా సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రికి విన్నవిస్తా నని తెలిపారు. యావర్‌ రోడ్డు జగిత్యాల ప్రజల చిరకాల కల అని, టౌన ప్లానింగ్‌ అధికారులు వాటి పై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని, కౌన్సిల్‌ ఆమోదం తెలిపిన పనులపై నివేదిక లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభత్వం జగిత్యాల పట్టణ అభివృద్ధికి సానుకూలంగా ఉన్నదని, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్స న సమిండ్ల వాణిశ్రీనివాస్‌, కమిషనర్‌ స్పందన, టీపీవో శ్రీనివాస్‌, ఏఈలు అనిల్‌, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు

జగిత్యాలరూరల్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని, రాజకీయాలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలంలోని అనంతారం గ్రామంలో షేక్‌ సాధుల్ల ఇమామ్‌భీ ఇంది రమ్మ లబ్ధిదారుడి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గానికి 4,500 డబల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో గ్రామ, గ్రామాన పండగ వాతావరణం నెలకొందని పేర్కోన్నారు. జగిత్యా ల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని అన్నారు. గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటుగా భోజనం కల్పిస్తున్నామన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అనే క సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. నెలకు ఆరు వేల కోట్ల బ్యాంక్‌ రుణాలను చెల్లిస్తూ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతోపాటు వారి సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని కోరారు. రాష్ట్రంలో సన్న ధాన్యానికి బోనస్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం కాంగ్రెస్‌ ప్రభుత్వమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ శాఖ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన వాణిశ్రీనివాస్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన గిరి నాగభూషణం, నాయకులు బాలముకు దం, గట్టుసతీష్‌, సర్పంచ బత్తినరవీణ, వార్డుసభ్యులు మధు, నాగరాజు, గుట్రాజ్‌పల్లిసర్పంచ వాసాల మల్లేష్‌, మాజీఎంపీటీసీ దమ్మ సురేందర్‌రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 12:19 AM