Share News

రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:48 AM

రైతులు పండిం చిన పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, ప్రభుత్వ విప్‌ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్‌ అన్నారు.

రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు

చందుర్తి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి) : రైతులు పండిం చిన పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, ప్రభుత్వ విప్‌ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం చందుర్తి మండలం బండపల్లిలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ విలేకరులతో మాట్లాడారు. నిన్న మాజీ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆది శ్రీని వాస్‌ మండిపడ్డారు. గతంలో వరి వేస్తే ఉరే అన్న కేసీ ఆర్‌ తనయుడు కేటీఆర్‌ రైతులను అడ్డంపెట్టుకొని రాజకీ యం చేయాలని చూస్తున్నారన్నారు. పదవి పోయాక కేటీఆర్‌కు రైతులు గుర్తుకు వస్తున్నారన్నారు. గత ప్రభు త్వం హయాంలో 2022 ఏప్రిల్‌ 25వతేదీ వరకు కొనుగో లు కేంద్రాలను ప్రారంభించలేదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశా ల మేరకు, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సూచనలతో కలెక్టర్‌ గరిమ అగ్రర్వాల్‌ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, అధికారులు సమన్వ యంతో పనులు వేగవంతం చేస్తున్నారని చెప్పారు. జిల్లాలో అగ్రికల్చర్‌ అధికారులు, డీఎస్‌వో, డీసీవో, డీఎం లు కలిసి రైస్‌మిల్లర్లకు అలాట్మెంట్లు కేటాయిస్తూ, ఇంట ర్మీడియట్‌ గోదాములను పరిశీలిస్తూ కొనుగోళ్లను సజావు గా నిర్వహిస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులపై చూపిన నిర్లక్ష్యాన్ని గుర్తుచేశారు. 2022లో కొనుగోలు కేంద్రాల ద్వారా ఒక్క క్వింటాల్‌ కూడా కొనలే దని, 2023 రబీ సీజన్‌లో కేవలం 161 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత 2024 రబీ సీజన్‌లో 56,614 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసి రైతుల పట్ల తమ నిబద్ధతను చాటిందని పేర్కొన్నారు. జిల్లాలో ఈ సీజన్‌లో సుమారు 2,42,000ఎకరాల్లో వివిధ పంటలు పండించగా, అందు లో 1,89,000 ఎకరాల్లో వరి సాగు జరిగిందని, దాదాపు 4,50,000 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు చేపడుతోందన్నారు. రైస్‌మిల్లుల్లో స్థలభా వం ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు 24 రైస్‌ మిల్లర్లకు 1,42,000 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం నిల్వ సామర్థ్యం ఉందని, మార్కె ట్‌ కమిటీల ఆధ్వర్యంలో 40,000 మెట్రిక్‌ టన్నుల నిల్వకు గోదాములు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అదనంగా అవసర మైతే అపెరెల్‌ పార్క్‌ వద్ద గోదాములను వినియోగించేందుకు చర్యలు తీసుకుంటు న్నామని వెల్లడించారు. ఎఫ్‌సీఐ గోదాము ల అలాట్‌మెంట్‌ ఆలస్యమవుతున్నప్పటి కీ, రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నా య చర్యలు తీసుకుంటోందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై రాజకీయాలు చేయడం సరికాదని, రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీయొద్దని ప్రతిపక్షాలకు సూచించా రు. జిల్లాలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగో లు చేయడం ప్రభుత్వ బాధ్యతగా తీసుకుని, రైతులను రాజులుగా నిలబెట్టే ప్రభుత్వం తమదేనన్నారు. సమావే శంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు చింతపంటి రామ స్వామి, సర్పంచులు కటకం మల్లేశం, బొజ్జ మల్లేశం, మొకినపల్లి దేవరాజు, నాయకులు ముస్కు మల్లారెడ్డి, గొట్టె ప్రభాకర్‌, లచ్చిరెడ్డి, స్వామి, నవీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2026 | 12:48 AM