Share News

ఆర్టీసీ సమ్మె విరమణ

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:37 PM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మె విరమించారు. దీంతో కరీంనగర్‌ రీజియన్‌ వ్యాప్తంగా ఉన్న 11 డిపోల నుంచి బస్సులు రోడ్డెక్కాయి.

ఆర్టీసీ సమ్మె విరమణ
సీఎం, మంత్రుల చిత్ర పటాలకు పాలాభిషేకం చేస్తున్న ఆర్టీసీ జెఎసి నాయకులు

భగత్‌నగర్‌, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మె విరమించారు. దీంతో కరీంనగర్‌ రీజియన్‌ వ్యాప్తంగా ఉన్న 11 డిపోల నుంచి బస్సులు రోడ్డెక్కాయి. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు 32 డిమాండ్ల పరిష్కారం కోసం కార్మికులు మూడు రోజులు సమ్మెలో పాల్గొన్నారు. శాంతియుతంగా సమ్మెలో పాల్గొని ప్రయాణికులకు సంస్థకు ఏలాంటి నష్టం వాటిల్లకుండా సమ్మెలో పాల్గొన్నారు. శుక్రవారం రాత్రి వరకు ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది.

ఫ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కృతజ్ఞత సమావేశం

రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి డిమాండ్లను పరిష్కరించడంతో కరీంనగర్‌-1, కరీంనగర్‌-2 డిపోల ఎదుట కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నర్సంపేట డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌కు నివాళులర్పించారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా ఛైర్మన్‌ ఎంపీ రెడ్డి, వైస్‌చైర్మన్‌ కె కొమురయ్య, జేఏసీ జిల్లా కో కన్వినర్‌ దొంత రాజయ్య, కరీంనగర్‌-1 ఛైర్మన్‌ జి మనోహర్‌, కరీంనగర్‌-2 డిపో ఛైర్మన్‌ ఎంఆర్‌రెడ్డి, కార్మికులు పాల్గొన్నారు.

ఫ ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల కల నెరవేరిందని కాంగ్రెస్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల డిమాండ్లను పరిష్కరించడంతో కరీంనగర్‌-1 డిపో ఎదుట కాంగ్రెస్‌ కార్యకర్తలు, కార్మికులతో కలిసి సంబురాలు నిర్వహించి, ముఖ్యమంత్రి, మంత్రుల చిత్ర పటాలకు పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా కార్యదర్శి టీఆర్‌ రెడ్డి, ముస్తాక్‌ అహ్మద్‌, కుంబాల రాజుకుమార్‌, వీర దేవేందర్‌, శ్రీరాముల రమేష్‌, ఇమ్రాన్‌, గడప శ్రీనివాస్‌, ఇమ్రాన్‌, పెంట శేఖర్‌, అరుణ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, వసీం, యూనియన్‌ నాయకులు, టీఆర్‌రెడ్డి, ఎన్‌కే దాసు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 11:37 PM