పంట వ్యర్థాలను కాల్చితే.. పర్యావరణానికి ముప్పు
ABN , Publish Date - May 29 , 2026 | 11:59 PM
వరి పంట వ్యర్థాల ను కాల్చితే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ పేర్కొన్నారు. మండలం లోని వెంకటాపూర్ గ్రామంలో పదిరోజుల క్రితం గుర్తుతెలి యని వ్యక్తులు వరికొయ్యలు కాల్చడం వల్ల సుమారు 50 ఎకరాల వరకు మంటలు వ్యాప్తి చెందాయి.
- జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్
వెల్గటూర్, మే 29 (ఆంధ్రజ్యోతి): వరి పంట వ్యర్థాల ను కాల్చితే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ పేర్కొన్నారు. మండలం లోని వెంకటాపూర్ గ్రామంలో పదిరోజుల క్రితం గుర్తుతెలి యని వ్యక్తులు వరికొయ్యలు కాల్చడం వల్ల సుమారు 50 ఎకరాల వరకు మంటలు వ్యాప్తి చెందాయి. శుక్రవారం ఆయన మండల వ్యవసాయాఽధికారి సాయి కిరణ్‌తో కలిసి క్షేత్ర పరిశీలన చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లా డుతూ వరి కొయ్యలకు నిప్పు పెట్టడం వలన భూసారం దెబ్బతింటుందన్నారు. వరికొయ్యలు నేలలో కలియ దున్ని తే సేంద్రియ కర్భనశాతం పెరుగుతుందని తెలిపారు. పంట వ్యర్థాలను కలియ దున్నితే నత్రజని, పాస్పరస్ అద నంగా అందుతుందని, వీటితోపాటు జింకు, మాంగనీస్, ఇనుము, క్యాల్షియం లాంటి సూక్ష్మధాతువులు అంది పంటకు మేలు చేకూరుస్తాయని స్పష్టం చేశారు.
మండల వ్యవసాయాధికారి సాయి కిరణ్ మాట్లాడు తూ పంట వ్యర్థాలను కాల్చితే రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విఽధిస్తామని తెలిపారు. అనంతరం మండ లంలోని ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. కార్యక్ర మంలో వ్యవసాయ విస్తరణ అధికారి వంశీ, సర్పంచ బిల్ల కూరి తిరుపతి, కార్యదర్శి ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
సన్న రకాలను అందుబాటులో ఉంచాలి
కొడిమ్యాల: రైతులకు వరిలో సన్న రకాల విత్తనాలను అందుబాటులో ఉంచాలని ఏవో జ్యోతి డీలర్లకు సూచించా రు. శుక్రవారం మండల కేంద్రంలో, మండలంలోని పూడూర్, నమిళికొండ గ్రామాలలోని విత్తన, ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. దుకాణాల్లోని విత్తన, ఎరువు ల నిల్వలను, స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్‌లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఏవో మాట్లాడుతూ దుకాణాల ఎదుట స్టాక్, ప్రైస్ బోర్డులను ప్రదర్శించాలన్నారు. విత్తనాలను, ఎరువులను కొనుగోలు చేసిన రైతులకు తప్పకుండా బిల్లును ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ నిబందనలను అతిక్రమించిన దుకాణాల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.