ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత సమాజ నిర్మాణం
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:07 AM
ప్రజల భాగస్వా మ్యంతోనే సురక్షిత, శాంతియుత సమాజ నిర్మాణం సాధ్యమని ఎస్పీ మహేష్ బి గితే అన్నారు.
తంగళ్లపల్లి, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ప్రజల భాగస్వా మ్యంతోనే సురక్షిత, శాంతియుత సమాజ నిర్మాణం సాధ్యమని ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం తంగళ్లపల్లి మండ లం తాడూరులో నిర్వహించిన గ్రామసభకు ఎస్పీ ము ఖ్యఅథితిగా హాజరయ్యారు. ఈసందర్భంగా గ్రామస్తుల తో ముచ్చటించి వారి సమస్యలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ రోడ్డు భద్రత మన అందరి భాధ్యత అని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమా లు పాటించాలన్నారు. వాహనదారులు తమ స్వీయరక్ష ణార్దం, కుటుంబ క్షేమం కొసం తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్‌డ్రైవింగ్, రాంగ్‌రూట్ డ్రైవిం గ్ చేయవద్దని, మైనర్ డ్రైవింగ్‌పై కఠినంగా వ్యవహరి స్తామన్నారు. ఆరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ రోడ్ సేప్టీ కమిటీలు గ్రామాల్లో ఉన్న రహదారి భద్రతా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రధాన సమస్యలకు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకె ళ్లి వాటి పరిష్కారానికి సమన్వయం తో పని చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో గ్రామ రోడ్ సేప్టీ కమిటీల పాత్ర కీలకమని తెలి పారు. మహిళలు, యువతులు, బాలి కలు జిల్లా షీటీమ్ సేవలు సద్విని యోగం చేసుకోవాలన్నారు. స్కూల్, కాలేజ్, పని చేసే ప్రదేశాల్లో మహిళలు,విద్యార్థినులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కుంటే నిర్భయంగా షీటీమ్ నంబరు 8712656425 నంబరులో సంప్రదించాలన్నారు. భరోసా కేంద్రం ద్వారా లీగల్, వైద్యసహాయం, మానసిక కౌన్సిలింగ్ సేవలంది స్తారన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు పోలీ సులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ నాగేశ్వరావ్, ఇన్‌చార్జీ ఎంపీడీవో రమే శ్, ఎంపీవో మీర్జా, సర్పంచ్ రెడ్డిమల్ల సదానందం, ఎం ఈవో రాజు నాయక్, ఎస్‌ఐ ఉపేంద్రచారి పాల్గొన్నారు.