15న సిరిసిల్లలో బీఎస్పీ బహిరంగ సభ
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:04 AM
బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాప క అధ్యక్షుడు కాన్షీరాం జయంతిని పురస్కరించుకొని ఈనెల 15న సిరిసిల్లలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని జిల్లా అధ్యక్షుడు కొమ్మెట అశోక్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాప క అధ్యక్షుడు కాన్షీరాం జయంతిని పురస్కరించుకొని ఈనెల 15న సిరిసిల్లలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని జిల్లా అధ్యక్షుడు కొమ్మెట అశోక్ అన్నారు. గురువారం సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం లో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు అశోక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎలగందుల వెంక న్న మాట్లాడారు. కాన్షీరాం చూపిన బాటలో నడిచి బహుజన రాజ్యాన్ని సాధిం చుకోవడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. జిల్లాలో బీఎస్పీని మరిం త బలోపేతం చేయాలని, రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతుందన్నారు. ఈనెల 15న సిరిసిల్లలో 5వేల మందితో భారీ బహిరంగసభను నిర్వహించడం కోసం శుక్రవారం స్థానిక కామా క్షి బ్యాంక్వెట్ హాల్లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో ని నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో సమావేశానికి హాజరుకావాలన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రం శేఖర్, జోనల్ చీఫ్ కోఆర్డినేటర్ నిషాని రాంచంద్రం, ఇతర నాయకులు పాల్గొంటార న్నారు. సమావేశంలో బీఎస్పీ నాయకుడు లింగంపల్లి మహేష్ పాల్గొన్నారు.