Share News

అత్యధిక మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు

ABN , Publish Date - Feb 05 , 2026 | 12:09 AM

తెలంగాణలో అత్యధిక మున్సిపాలిటీలలో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుస్తుందని ఎమ్మెల్సీ ఎల్‌ రమణ అన్నారు.

అత్యధిక మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు

సిరిసిల్ల టౌన్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్ర జ్యోతి) : తెలంగాణలో అత్యధిక మున్సిపాలిటీలలో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుస్తుందని ఎమ్మెల్సీ ఎల్‌ రమణ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం లోని తెలంగాణ భవనంలో విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడా రు. గత ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా హామీలను ఇవ్వడంతోనే అధికారంలోకి వచ్చింద న్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆపే సిందని ఆరోపించారు. 2023ఎన్నికలలో రాజ్యాం గానికి అనుగుణంగా ప్రజా పాలన చేయాలన్న రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి అధికారంలోకి వ చ్చాక మరిచిపోయారిని విమర్శించారు. బీఆర్‌ ఎస్‌ పార్టీ కారు గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు అధికార దాహంతో బీఆర్‌ఎస్‌ పార్టీ ని వీడి కాంగ్రెస్‌లో చేరారని ఆరోపించారు. తె లంగాణ ప్రజా క్షేత్రంలో ఇలాంటి మోసగాళ్లను ప్రజలి వదిలపెట్టరని సరైన సమయంలో బుద్ధి చెపుతారన్నారు. సిరిసిల్ల మున్సిపల్‌ ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపు ఖాయమని ము న్సిపల్‌పై బీఆర్‌ఎస్‌ జెండా ఎగరబోతోందన్నా రు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు లింగంపల్లి మధుకర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా రమణ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం 30వ వార్డులో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంను ఎమ్మె ల్సీ రమణ ప్రారంభించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ము న్సిపల్‌ ఎన్నికల సమన్వయకర్త తుల ఉమ, టెస్కాబ్‌ మాజీ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రా వు, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపా ణి, నాయకుడు చీటి నర్సింగరావు పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 12:09 AM