Share News

బాకీ కార్డు పేరుతో బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారం

ABN , Publish Date - Sep 04 , 2026 | 12:43 AM

బీఆర్‌ ఎస్‌ పార్టీ బాకీ కార్డు పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని, ఆ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

బాకీ కార్డు పేరుతో బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారం

వేములవాడ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ ఎస్‌ పార్టీ బాకీ కార్డు పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని, ఆ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వెయ్యి రోజులుగా ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ పూర్తిగా విఫలం అయిన నేపథ్యంలో వేములవాడ పట్టణంలో గురువారం కేసీఆర్‌ రాజీనా మా చేయాలని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో 500మీట ర్ల భారీ ప్లెక్సీతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భం గా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో రాష్ట్రం ఎదుర్కొంటున్న వైఫల్యాలను ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకే ప్రదర్శన నిర్వహించామన్నా రు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు, వైస్‌ చైర్మన్‌ కనికరపు రాకేష్‌, కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షుడు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2026 | 12:43 AM