మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటాలి
ABN , Publish Date - Jan 05 , 2026 | 01:01 AM
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగురవేయాలని జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు.
-బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు
రాయికల్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగురవేయాలని జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. రాయికల్ పట్టణంలో ఆదివారం బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో రాబోయే మున్సిపల్ ఎన్నికలపై మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్‌తో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీగా ఉన్న రాయికల్‌ను మున్సిపల్ చేసిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. బీఆర్‌ఎస్ హాయాంలో రూ.25 కోట్ల నిధులతో ఇప్పటివరకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పారీట అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పనులు కూడా చేయలేదని, బీఆర్‌ఎస్ హాయాంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాగా కొనసాగిందని అన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వ యంతో కలిసి పని చేసి రాయికల్ పట్టణంలోని 12 వార్డుల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగురవేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మారంపెల్లి రాణి సాయి కుమార్, ఉదయశ్రీ, లింగన్న, మాజీ కౌన్సిలర్లు తురగ శ్రీధర్ రెడ్డి, సాయి కుమార్, సువర్ణ, శ్రీరాములు, సత్యనారాయణ, మహేష్ గౌడ్, కో ఆప్షన్ వనిత, గణేష్, సోహెల్, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.