Share News

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు ఖండనీయం

ABN , Publish Date - Sep 09 , 2026 | 12:46 AM

అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు ఖండనీయమని సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు ఖండనీయం

కరీంనగర్‌ అర్బన్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు ఖండనీయమని సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌ కోర్టు చౌరస్తా వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి ఆయన మంగళవారం పూలమాల వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలకు ఒక్కరోజు ముందు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై ఇలాగే మాట్లాడమని శిక్షణ ఇచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కేసీఆర్‌ విలువలకు తిలోదకాలిచ్చారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ పర్వతం మల్లేశం, నాయకులు గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, జీడి రమేష్‌, దండి రవీందర్‌, పోచయ్య, యనమల మంజుల, ముల్కల కవిత, అస్తపురం తిరుమల, ఎండీ చాంద్‌, ఫజల్‌, జ్యోతి రెడ్డి, బత్తుల రాజ్‌ కుమార్‌, కీర్తి కుమార్‌, బుర్ర గంగయ్య, జిలుకర రమేష్‌, షెహెన్షా, ఖలీల్‌, లక్కిరెడ్డి కిరణ్‌రెడ్డి, సాయిరాం, సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2026 | 12:46 AM