Share News

బీఆర్‌ఎస్‌ నాయకుల సైకిల్‌ యాత్ర

ABN , Publish Date - Nov 02 , 2026 | 12:36 AM

మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్‌ వరకు బీఆర్‌ఎస్‌ నాయకుడు బొడ్డు రవీందర్‌ ఆధ్వ ర్యంలో చేపట్టిన సైకిల్‌ యాత్ర ఆదివారం బోయినపల్లి మండల కేంద్రానికి చేరుకుంది.

బీఆర్‌ఎస్‌ నాయకుల సైకిల్‌ యాత్ర

బోయినపల్లి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్‌ వరకు బీఆర్‌ఎస్‌ నాయకుడు బొడ్డు రవీందర్‌ ఆధ్వ ర్యంలో చేపట్టిన సైకిల్‌ యాత్ర ఆదివారం బోయినపల్లి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా మండల బీఆర్‌ఎస్‌ నాయకులు యాత్రకు ఘన స్వాగతం పలికారు. అనంతరం యాత్రలో భాగంగా నాయకులు మిడ్‌ మానేరు ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. తెలంగా ణలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిపై ప్రజలకు వాస్తవాలను తెలియజేయడమే లక్ష్యంగా సైకిల్‌ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, ప్రధాన కార్యదర్శి గంటి శంకర్‌, నీలోజిపల్లి సర్పంచ్‌ అనుముల భాస్కర్‌, కొనుకటి నాగయ్య, జంపుక ఆనంద్‌, అక్కనపల్లి కరుణాకర్‌, నిమ్మ శ్రీనివాస్‌ రెడ్డి, గురజాల కోటి తదితరులు పాల్గొన్నారు.

ఇల్లంతకుంట : కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకవచ్చి సాగునీటిని అందించాలని డిమాండ్‌ చేస్తు చేపట్టిన సైకిల్‌ యాత్ర ఆదివారం ఇల్లంత కుంటకు చేరుకుంది. ఈసందర్భంగా వారు మాట్లాడుతు మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్‌ వరకు 400కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజి మరమ్మత్తులు పూర్తిచేయాలని, కన్నెపల్లి పంప్‌ హౌజ్‌ను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. మేడిగడ్డ వద్ద 20వేల క్యూసెక్కుల నీరు దిగు వకు వెళుతున్నా ప్రభుత్వం నీటిని ఎత్తిపోయ డం లేదన్నారు. నీటిని ఎత్తిపోస్తే రైతులకు సాగునీరు అంది పంటలు పండుతాయన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ గోదావరిఖని పట్టణ అధ్యక్షుడు బొడ్డు రవీందర్‌, పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్‌, నాయకులు కాశి పాక శ్రీనివాస్‌, ఆరెపల్లి సురేష్‌, ముత్యం లక్ష్మణ్‌ గౌడ్‌, పారుపలి అనీల్‌, మేకల నవీన్‌, గుండబో యిన శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2026 | 12:36 AM