అబద్ధాలాడుతున్న బీఆర్‌ఎస్ నాయకులు
ABN , Publish Date - Oct 03 , 2026 | 12:27 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మొన్నటి రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాదయాత్ర, బహిరంగ సభకు వచ్చిన ప్రజలను చూసి బీఆర్‌ఎస్ నాయకులకు మైండ్ బ్లాక్ అయి మతి భ్రమించి అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నా రు.
సిరిసిల్ల టౌన్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మొన్నటి రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాదయాత్ర, బహిరంగ సభకు వచ్చిన ప్రజలను చూసి బీఆర్‌ఎస్ నాయకులకు మైండ్ బ్లాక్ అయి మతి భ్రమించి అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నా రు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేం ద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో విలేకరుల సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాద యాత్ర, బహిరంగ సభను విజయవంతం చేసిన జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపా రు. ముఖ్యమంత్రి బహిరంగ సభకు జిల్లాలో ని ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజ లు పాల్గొన్నారని, బహిరంగ సభకు దాదాపు లక్ష మందికి పైగా హాజరై విజయవంతం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాదయాత్ర, బహిరంగ సభకు వచ్చిన ప్రజ లను చూసిన బీఆర్‌ఎస్ నాయకులు వారి మనుగడ కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్‌ఎస్ నాయకులు గురువారం మళ్లీ అన్ని అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు. రేవం త్‌రెడ్డిని ప్రజలు ఆదరించడాన్ని చూసి కేటీ ఆర్ గుండ్ లబ్ డబ్ అనుకుండా ప్రస్తుతం రేవంత్ రేవంత్ అని కొట్టుకుంటూ ఉండవ చ్చని ఎద్దేవా చేశారు. కుటుంబం పోషణకు 2006లోనే హైదరాబాద్‌లో హోటల్ పెట్టుకు న్నామని 2009 ఎన్నికలలో అఫిడవిట్‌లో కూడా రాశామన్న కేటీఆర్ ప్రస్తుతం తమకు మూడు హోటళ్ళు ఉన్నాయనడం విడ్డూరం గా ఉందన్నారు. కుటుంబ పోషణకు వ్యాపా రాలు అంటున్నా కేటీఆర్ మరి సిరిసిల్ల ప్రజ ల కష్టాలు ఎవరి బాధ్యత...? అని ప్రశ్నించా రు. సిరిసిల్లలో మరమగ్గాలు మూగబోతుంటే హైదరాబాద్‌లో నీ హోటళ్ల గదులు పెరిగా యంటూ విమర్శించారు. సిరిసిల్ల నియోజక వర్గం ప్రజలు గెలిపిస్తుంటే ఎమ్మెల్యేగా, మం త్రిగా ప్రజలకు ఏమిచ్చావ్ హైదరాబాద్‌లో ఫైవ్‌స్టార్ హోటళ్లు కట్టుకున్నాడని ఆరోపిం చారు. ఆస్తుల లెక్క, పెట్టుబడుల మూలం, సిరిసిల్ల నియోజకవర్గంకు చేసిన పనులు ఏంటో కేటీఆర్ సమాధానం చెప్పాలని డి మాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి సభ తరువాత ప్రజలు కేటీఆర్ వైపు చూస్తున్నారని ప్రజల నమ్మకానికి లెక్క చెప్పకపోతే రానున్న ఎన్ని కలలో కేటీఆర్ లెక్క తేల్చడం పక్కాఅన్నారు. 2009 నుండి 2026 వరకు కేటీఆర్ ఆస్తులు ఎలా పెరగాయని అలాగే హరీష్‌రావు ఆస్తు లు ఎలా పెరగాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత తక్కువ సమయం లో ఆస్తులు కూడబెట్టిన మీ వ్యాపార కిటుకు లను యువ పారిశ్రామక వేత్తలకు క్లాస్‌లు పెట్టి చెప్పాలన్నారు. భారత దేశంలో ఈ ప్రాంతీయ పార్టీకి వందల కోట్ల రూపాయు ఎలా వచ్చాయ్ బీఆర్‌ఎస్ పార్టీ అకౌంట్‌లో ఉన్న రూ.1400 కోట్లు క్విడ్ ప్రో కో కింద వచ్చిన అవినీతి సొమ్ము అని కవితరమ్యరా వు అంటున్నారని అన్నారు. మిడ్ మానేరుకు కాళేశ్వరం నీరు వచ్చాయన్న వారికి సిగ్గుండా లన్నారు. కాళేశ్వరం ఎపుడో కూలేశ్వరం అ యిందన్నారు. రానున్న రోజులలో సిరిసిల్ల గడ్డపై మూడు రంగుల జెండా ఎగరడం ఖాయమన్నారు.వినోద్‌రావు చేసిన అప్పులను కడుతున్నామని, రూ.350కోట్లు సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలను తమ ప్రభుత్వం చె ల్లించిందన్నారు. వేములవాడ గుడి చెరువు పూడ్చడానికి ఖర్చు రూ.3కోట్లు అయితే పదు ల కోట్లు అయిన్నాయని అన్నారు, కొత్తగా చె రువు తవ్వలేదు ఉన్న చెరువును పూడ్చడం లో కూడా దోచుకున్నారు సిగ్గుండాలి అని ఆరోపించారు. రూ. 20 కోట్లు హుడా నుంచి వచ్చిన నిధులు వెనక్కి వెళ్లితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి మళ్లీ ఆ నిధులను వెనక్కి తీసుకొచ్చానని అన్నారు. వేములవాడ రాజన్న దేవాలయం ఎఫ్‌డీ డబ్బులు పోచ మ్మ దేవాలయం నిర్మాణం కోసం తీసుకొస్తే వాటి అప్పులు తమ ప్రభుత్వం కడుతుంద న్నారు. ఆదే విధంగా వేములవాడ ట్యాంక్ బండ్ పార్క్‌ను రూ.12 కోట్లతో మేము పూర్తి చేశాం బ్రిడ్జి నిర్మాణం కోసం మీ ప్రభుత్వం లో కొబ్బరికాయ కొట్టారు కానీ భూ సేకరణ ఎందుక చేయలేక పోయారు...? అని ప్రశ్నిం చారు. జీవన్‌రెడ్డి మంత్రిగా ఉన్న సమయం లో వేములవాడ మొదటి బైసాస్‌రోడ్డు మీ విదేశి దొర ఇంటి ముందు నుండి వేస్తే బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో వేశామని వినోద్‌రావు అనడంతో పక్కనే ఉన్న జీవన్‌రెడ్డి గుండె కలుక్‌మని అని ఉండవచ్చునన్నారు. తొమ్మి దిన్నర సంవత్సరాలు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఎగువ మానేరు నుండి మల్కాపేట రిజర్వా యర్‌కు కాలువ తీయలేకపోయానడని ఆరో పించారు. రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితంలో దాదాపు 17 సంవత్సరాలు ప్రతి పక్షంలో ఉన్నారని వ్యాపారాలు చేసి ఆస్తులు సంపా దించుకున్నారని మీలా ప్రజాసొమ్మును కొల్లగొట్టలేదని ద్వజమెత్తారు. పేద ప్రజల చేతులో ఉండాల్సిన ప్రభుత్వ భూములు కల్వకుంట్ల కుటుంబం చేతిలోకి వెల్లాయని ఆరోపించారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులకు హరీష్‌రావు భూ సేకరణ చేయకుండా శంకుస్థాపన చేసి ప్రజలను మోసం చేశాడని అన్నారు. మీ మాయ మాటలను ప్రజలు నమ్మె పరిస్థితి లేరని రానున్న ఎన్నికలలో సిరిసిల్ల గడ్డపై మూడు రంగుల జెండా ఎగరవేయడం ఖాయమని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్య క్షుడు సంగీతం శ్రీనివాస్, జిల్లా గ్రంథా లయం చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటి చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి, టీపీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, సిరిసల్ల పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నీలి రవీందర్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, కౌన్సిలర్ బొద్దుల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ వెంగళ లక్ష్మినర్సయ్య, నాయకులు కంసాల మల్లేశం, యాదగిరి పాల్గొన్నారు.