దళితులను కించపరుస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు
ABN , Publish Date - Sep 11 , 2026 | 01:04 AM
బీఆర్‌ఎస్ నాయకులు దళితు లను కించపరుస్తున్నారని కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు అన్నారు.
సిరిసిల్ల టౌన్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్ నాయకులు దళితు లను కించపరుస్తున్నారని కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు అన్నారు. గురువారం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆకునూరి బాలరాజు, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల జగన్ మాట్లాడా రు. మూడు రోజులుగా అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమని స్తున్నారన్నారు. శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషించడంలో బీఆర్‌ఎస్ పార్టీ వైఫల్యం చెందిందని ఆరోపించారు. శాసన సభలో ఎలాంటి చర్చ జరగవద్దు పేదోడికి న్యాయం జరగవద్దని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. శాసనసభ సమావేశంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రౌడీల్ల వ్యవహరిస్తున్నారని అసెంబ్లీ ముందు టీషర్టులు విప్పి మహిళ ఎమ్మెల్యేల ముందు అర్ధనగ్న ప్రద ర్శన చేశారని మండిపడ్డారు. గతంలో బీఆర్‌ఎస్ పార్టీ 720హామీలను ఇచ్చి ఎగ నామం పెట్టిందని అందులో దళితుడిన ముఖ్యమంత్రి చేస్తాన్న కేసీఆర్ మాట తప్పాడన్నారు. స్పీకర్‌ను అవమానించిన ఎమ్మెల్సీ తాతా మధుపై చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేస్తూ వెయి దప్పులతో కేసీఆర్ ఫామ్‌హౌజ్ ముట్టడికి తర లివెళ్లారన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి నేదూరి లక్ష్మణ్, నాయకులు కంసాల మల్లేశం, నక్క నర్సయ్య, తుంగ శివరాజ్ పాల్గొన్నారు.