నేతన్నలను ఓటు అడిగే హక్కు బీఆర్‌ఎస్, కేటీఆర్‌కు లేదు
ABN , Publish Date - Feb 09 , 2026 | 12:33 AM
సిరిసిల్ల నేతన్నలను ఓటు అడిగే హక్కు బీఆర్‌ఎస్, కేటీఆర్‌లకు లేదని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు.
సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల నేతన్నలను ఓటు అడిగే హక్కు బీఆర్‌ఎస్, కేటీఆర్‌లకు లేదని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్ర చారంలో భాగంగా సిరిసిల్ల అంబేద్కర్ చౌర స్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్నర్ మీ టింగ్ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మా ట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్స రాల్లో నేతన్న, రైతన్న, సామాన్యులు, శ్రమజీ వులు, కష్ట జీవులు, నిరుద్యోగులు, మహిళల కోసం చేసిన కార్యక్రమాలతో ఎక్కడ లేని విధంగా ఉద్వేగం, ఉత్సాహమే సిరిసిల్లలో జరుగుతున్న సమావేశానికి వచ్చిన స్పందన అన్నారు. పేద ప్రజలకు 200 యూనిట్లు ఉచి త విద్యుత్, వంట గ్యాస్ సబ్సిడీ, సన్న బియ్యం పేద ప్రజలకు రేవంత్‌రెడ్డి ప్రభు త్వం అందిస్తోందన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అనేకమార్లు ముఖ్యమంత్రిని మెప్పించి ఒప్పించి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎగ్గొ టినటువంటి బకాయిలను అందించిన ఘను డన్నారు. బతుకమ్మ చీరలు, త్రిఫ్ట్, భీమా భద్రతతో పాటు నేతన్న కార్యక్రమాలన్నింటిని రద్దు చేసి 10 సంవత్సరాల్లో కనీసం రూ. 100 కోట్లు ఇవ్వనటువంటి బీఆర్‌ఎస్ పార్టీకి, కేటీఆర్‌కు సిరిసిల్ల నేతన్నలను ఓటు అడిగే హక్కు లేదని విమర్శించారు. మహేందర్‌రెడ్డి విజ్ఞప్తి మేర ఒకే సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు చెల్లించి నేతన్నలకు అన్ని సదుపాయాలను కల్పించడానికి రూ. 1000కోట్లను ముఖ్యమంత్రి మంజూరు చేశా రన్నారు. సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి కల్పించాలని కోటి మహాలక్ష్మిలకు కోటి చీరలు ఇవ్వండి అని ముఖ్యమంత్రి ఆదేశించి భారత దేశంలో ఒక్కడలేని విధంగా ప్రతి మహిళకు చీరె సారె ఇస్తున్న ది కాంగ్రెస్ ప్రభు త్వం అన్నారు. మీ సమస్యలను పరి ష్కరించాలని రూ. 50 కోట్లతో యార న్ డిపోను మం జూరు చేశామన్నా రు. 10 సంవత్సరా లు టెక్స్‌టైల్ మం త్రిగా ఉన్న కేటీఆర్‌ను కలవలేని మీరు కాం గ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండు సంవత్సరాల లో పదిసార్లు మమ్మల్ని కలసి పనులు చే యించుకున్న శక్తి ఈ సిరిసిల్ల నేతన్నలదన్నా రు. సిరిసిల్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే అది మీకు గౌరవం తెలంగాణలో ఎన్ని మున్సిపా ల్టీలు గెలిచింది కాదు సిరిసిల్లలో గెలిచిందా లేదా సిరిసిల్ల నేతన్న గెలిచారాలేదా అన్నది మీ చేతుల్లో ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి మీకు సామాజిక, రాజకీయ, ఉద్యోగ పరంగా అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసిందన్నారు. కులగణన ధామా ష ప్రకారం సిరిసిల్ల మున్సిపాల్టి ఎన్నికలలో 39 వార్డులో అభ్యర్థులకు అవకాశం కల్పించా మన్నారు. సిరిసిల్ల ప్రజలు తీసుకునే నిర్ణయా నికి రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారని ఇది అహంకారానికి అభిమానానికి మధ్య జరుగుతున్న యుద్ధం అని అన్నారు. అహం కారులని తరిమితరిమి కొట్టి ఆత్మాభిమాన్నా న్ని గెలిపించుకోండి, కావాల్సిన పనులను ముఖ్యమంత్రిని అడిగి చేయించే బాధ్యత వేదికపైన ఉన్న పెద్దలదని అన్నారు. ఎన్నికల సమయంలో సన్న బియ్యం ఇస్తామని మభ్య పెట్టలేదన్నారు. రూ.12000కోట్లు ఖర్చు చేస్తు న్నం బియ్యం అంతా మాఫియా చేతులోకి వెళ్తోంద.. ఏం చేద్దామని ముఖ్యమంత్రి అడి గాడన్నారు. నా తల్లులకు నా చెల్లెల్లకు పేద ప్రజలకు సన్నబియ్యం అందడం లేదని రైత న్నను సన్న బియ్యం పండించమని క్వింటా ల్‌కు రూ.500 ఇవ్వాలని, పండించిన సన్న బియ్యం నా తల్లులకు ఇవ్వాలని కడుపునిం డా తింటారని ముఖ్యమంత్రికి చెప్పడం జరి గిందన్నారు. రూ.15వేల కోట్లు ఖర్చు అయినా ఈరోజు ప్రతి బిడ్డ సన్నబియ్యం అన్నం తిం టున్నారంటే అది రేవంత్‌రెడ్డి ప్రభుత్వంతోనే సాధ్యం అయిందన్నారు. ఇల్లు లేని తల్లికి ఇందిరమ్మ ఇళ్లు, 200యూనిట్లు ఉచిత కరెం టు ఇస్తున్నామన్నారు. 2కోట్ల 79 లక్షల సార్లు మా తల్లులు ఉచిత బస్సు ప్రయాణం చేశార ని దానికి రవాణా శాఖ మంత్రి ప్రభాకర్‌కు రూ. 9600కోట్లు చెల్లించామన్నారు. ఉచిత విద్యుత్‌కు రూ.3700కోట్లు, రైతన్నకు రూ. 12 వేల కోట్లు ఉచిత కరెంట్‌కు ప్రభుత్వం చెల్లిం చిందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సహకరించకపోయిన అనేక ఆర్థిక పరమైన కష్టాలు ఉన్నా వేల కోట్లు రూపాయలు గత ప్రభుత్వం చేసిన అప్పులు చెల్లిస్తున్నామన్నా రు. రాష్ట్రంలో ఆర్థికపరంగా మోదీ ప్రభుత్వం వెంటాడి వేటాడి ఇబ్బంది పెట్టాలని చూస్తోం దని ఆరోపించారు. అయినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తూ అభివృ ద్ధి వెంట రాష్ట్రం పరిగెడుతుందన్నారు. కేకే మహేందర్‌రెడ్డిని గత ఎన్నికల్లో గెలిపించలేక పోయినా మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించండి ఎమ్మెల్యే కంటే పది రెట్లు అభివృద్ధి చేసి చూపించే బాధ్యత అతనిపై ఉంటుందన్నారు. మహేందర్ రెడ్డికి సిరిసిల్ల ప్రజలు శక్తినివ్వండి అడిగే హక్కునివ్వండి మీకు పనిచేసే అవకాశం ఇవ్వండి అహంకారులు అహం తగ్గించి కాం గ్రెస్ పార్టీని గెలిపించి చేతి గుర్తుకు ఓటు వేయాలన్నారు.
13వేల అంత్యోదయ కార్డులు తొలగించారు..
సిరిసిల్లలో ఆత్మహత్యలు, ఆకలిచావులు జరగవద్దని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా 13 వేల అంత్యోదయ కార్డులు ఇచ్చిందని బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ఒక్కదెబ్బతో తీసేసింద ని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిరిసి ల్ల సమస్యల పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సానుకూలంగా స్పందించారని అన్నారు. భవిష్యత్తులో కూడా సహకరించే విధంగా మున్సిపల్ ఎన్నికలలో ఆశీర్వదిస్తే ఈప్రాంత నేతన్నలకు మరింత లబ్ధి చే కూర్చే విధంగా నిర్ణయాలుంటాయన్నారు. సిరిసిల్ల మున్సిపాల్టీ లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక స్థానాలలో గెలిపించి చరిత్ర సృష్టించాలన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కేటీఆర్‌ఎస్ దాదాపు రూ.300 కోట్లు బతుకమ్మ చీరలను బకాయి పెట్టిపోతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల తుమ్మల నాగేశ్వ ర్‌రావు, పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెల్లి ఆ బకాయిలను చెల్లిం చామన్నారు. మున్సిపల్ ఎన్నికలలో చేయితిరిగిన వాడిని గెలిపి స్తే జిల్లా మంత్రి వద్దకు సమస్యలను చెప్పే అవకాశం ఉంటుం దని ప్రతిపక్షం అభ్యర్థిని గెలిపిస్తే కాళ్లలో కట్టెలు పెట్టినట్టు అవు తుందని సిరిసిల్ల ప్రజలు ఆలోచన చేయలన్నారు. సిరిసిల్లలో పద్మశాలి భవనం, మార్కండేయ దేవాలయం పూర్తి చేయడం కోసం కేటీఆర్ ఎందుకు కంకణం కట్టుకోలేదో నేతన్నలు ఆలోచ న చేయాలన్నారు. సిరిసిల్ల జిల్లాను అభివృద్ధి వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం.. ఈ ఎన్నికల్లో ఎక్కడ పొరపాటు లేకుం డా అమూల్యమైన ఓటును చేతి గుర్తుకు వేసి కాంగ్రెస్ అభ్య ర్థులను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాల యం చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూపతిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ అధ్య క్షుడు చొప్పదండి ప్రకాష్, అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.