ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్న బీఆర్‌ఎస్
ABN , Publish Date - Jan 05 , 2026 | 12:53 AM
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా చేస్తోం దని, బీఆర్‌ఎస్ వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా చేస్తోం దని, బీఆర్‌ఎస్ వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట, వీర్న పల్లి మండల కేంద్రాల్లో ఆటో డ్రైవర్లకు కేటీఆర్ ఆత్మీయ భరోసా, చల్మెడ ఆరోగ్య, ప్రమాద బీమా కార్డులను స్థానిక నాయకుల తో కలిసి ఆదివారం పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా ఆగయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల పూట గడవక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు ఒడి గట్టారని అన్నారు. ఉచిత బస్సు పథకంతో ఆటోలు నడవక ఉపాధిని కోల్పోయి వీధిన పడ్డాయని అన్నారు. ఆటో డ్రైవర్లకు అండగా నిలవాలనే లక్ష్యంతో కేటీఆర్ ఆరోగ్య, ప్రమాద బీమా కార్డులను అందిస్తున్నారని అన్నారు. తమ పార్టీ ఆటో డ్రైవర్లకు బాసటగా నిలిచి సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధంగా ఉందని ఆగయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బొల్లి రాంమ్మోహన్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, సెస్ డైరెక్టర్లు కృష్ణహరి, మల్లేశం, సర్పంచులు సుభాష్, నర్సయ్య, శరవింద్, తిరుపతి, దేవరాజు, మాజీ జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు, ప్యాక్స్ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు నర్సింహారెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్, దేవయ్య, రాజిరెడ్డి, రాంరెడ్డి, సంజీవ్, లింబాద్రి, అప్సరున్నీసా, కళ, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.