Share News

సిట్‌ విచారణపై బీఆర్‌ఎస్‌ డ్రామాలు

ABN , Publish Date - Feb 02 , 2026 | 12:57 AM

మున్సిపల్‌ ఎన్నికల్లో సెంటిమెంట్‌ కోసం సిట్‌ విచారణపై బీఆర్‌ఎస్‌ డ్రామాలు ఆడుతోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆరోపించారు.

సిట్‌ విచారణపై బీఆర్‌ఎస్‌ డ్రామాలు
మాట్లాడుతున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

-మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మపురి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల్లో సెంటిమెంట్‌ కోసం సిట్‌ విచారణపై బీఆర్‌ఎస్‌ డ్రామాలు ఆడుతోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆరోపించారు. ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం మంత్రి అడ్లూరి విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ దేశం కోసం పోరాటం చేసిన వ్యక్తి కాదన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి వ్యాపారు లను బెదిరించి డబ్బులు వసూళ్లు చేసిన మాట వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా సిట్‌ విచారణకు పిలవదని ఆయన అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో సెంటిమెంట్‌ రగిలించి ఓట్లు దండుకోవడానికి సిట్‌ విచారణపై మాజీ మంత్రి కేటీఆర్‌, హరీష్‌రావు డ్రామాలు ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో కేసీఆర్‌ విచారణపై మంత్రి స్పందించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంతో కేసీఆర్‌ను సిట్‌ విచారణకు పిలిస్తే దేశం కోసం పోరాటం చేసిన వ్యక్తిగా శాంతి యాత్రలు, ఇంకో యాత్రలు అని పిలుస్తూ కాంగ్రెస్‌ పార్టీపై బురదజల్లే కార్యక్రమం బీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తుందని ఆయన అన్నారు. ప్రజాస్వా మ్యంలో అధికార పక్షం, ప్రతి పక్షం రెండు ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ కోరుకుంటుందని తెలిపారు. కవిత ఫోన్‌ ట్యాపింగ్‌పై చేసిన ఆరోపణలకు ముందు సమాధానం చెప్పాలని మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆయన వెంట జగిత్యాల డీసీసీ అధ్యక్షులు గాజెంగి నందయ్య, టీపీసీసీ సభ్యులు, ధర్మపురి మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు సంగనభట్ల దినేష్‌, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ రవీందర్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు కుంట సుధాకర్‌, మండల కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు వేముల రాజేష్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు రాజేష్‌, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు అప్పం తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2026 | 12:57 AM