Share News

29న బీఆర్‌ఎస్‌ దీక్షాదివస్‌

ABN , Publish Date - Nov 13 , 2026 | 11:56 PM

తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేపట్టిన బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌) అధినేత కేసీఆర్‌ను అల్గునూర్‌లో అరెస్టు చేసిన సంద ర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 29న అల్గునూర్‌లో బీఆర్‌ఎస్‌ దీక్షా దివస్‌ పేరుతో భారీ బహిరంగ సభకు సన్నాహాలను ముమ్మరం చేసింది.

29న బీఆర్‌ఎస్‌ దీక్షాదివస్‌

కరీంనగర్‌ టౌన్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేపట్టిన బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌) అధినేత కేసీఆర్‌ను అల్గునూర్‌లో అరెస్టు చేసిన సంద ర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 29న అల్గునూర్‌లో బీఆర్‌ఎస్‌ దీక్షా దివస్‌ పేరుతో భారీ బహిరంగ సభకు సన్నాహాలను ముమ్మరం చేసింది. శుక్రవారం అలుగునూర్‌లో సభ నిర్వహించనున్న ప్రాంతాన్ని మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇతర బీఆర్‌ఎస్‌ నాయకులు పరిశీలించారు.

సభ నిర్వహణకు అనువైన ప్రాంతం, వేదిక ఏర్పాటు, సభకు హాజరయ్యే నాయకులు, కార్య కర్తలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ముఖ్యంగా సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాహనాల పార్కింగ్‌కు అనువైన స్థలాలను పరిశీలించారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో అలుగునూర్‌లో నిర్వహించనున్న సభకు రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. దీక్షా దివస్‌ కార్య క్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుం టూ గంగుల కమలాకర్‌ ముమ్మర చర్యలు చేపడుతున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌ రెడ్డి, జమ్మికుంట మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, మానకొండూర్‌ మాజీ జడ్పీటీసి తాళ్లపల్లి శేఖర్‌ గౌడ్‌, కొత్తపల్లి మండల మాజీ వైస్‌ ఎంపీపీ తిరుపతి నాయక్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2026 | 11:56 PM