Share News

పీఈటీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి..

ABN , Publish Date - Nov 15 , 2026 | 11:56 PM

తెలంగాణలోని వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం, సంబంధిత రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకెళ్తామని టీజీపేటా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపాన్నగారి నాగరాజుగౌడ్‌ అన్నారు.

పీఈటీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి..

సిరిసిల్ల టౌన్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలోని వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం, సంబంధిత రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకెళ్తామని టీజీపేటా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపాన్నగారి నాగరాజుగౌడ్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ పాఠశాల ఆవరణలో టీజీపేట జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా టీజీపేటా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపాన్నగారి నాగరాజుగౌడ్‌ హాజరయ్యారు. జిల్లాలో వ్యాయామ ఉపా ధ్యాయుల సమస్యలను ఆయనకు జిల్లా టీజీపేటా నాయకులు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీబీవీ వ్యాయామ ఉపాధ్యాయులకు సీఆర్‌టీలతో సమానంగా వేతన సవరణ చేయడంతో పాటు మోడల్‌ స్కూల్‌ వ్యాయామ ఉపాధ్యాయులకు జీవో నంబరు 252 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అమలవుతున్న విధంగా వేతన సవరణ కల్పించడానికి కృషి చేస్తామన్నారు. వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర స్థాయి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నిస్తామన్నారు. ఈ సమావేశంలో టీజీపేట జిల్లా అధ్యక్షుడు తడకల సురేష్‌, ఉపాధ్యక్షుడు సాంద్రకరి రాజు, ప్రధానకార్యదర్శి నాంపల్లి శ్రీనివాస్‌, కోశాధికారి తడకల శ్యాం సుందర్‌, కార్యదర్శులు బండిపెల్లి పరశురాం, దాని నరేష్‌, గౌరవ అధ్యక్షుడు దుప్పటి రవికుమార్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2026 | 11:56 PM