Share News

ఇందిరమ్మ ఇళ్లతో పేదల జీవితాల్లో వెలుగులు

ABN , Publish Date - Jul 22 , 2026 | 12:04 AM

రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మండలంలోని కొండయ్యపల్లికి చెందిన నలుగురు, ఇస్లాంపూర్‌కు చెందిన ఇద్దరు, రంగరావుపల్లికి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరవగా మంగళవారం గంగాధర ప్రజా కార్యాలయంలో ప్రొసీడింగ్స్‌ అందజేశారు.

ఇందిరమ్మ ఇళ్లతో పేదల జీవితాల్లో వెలుగులు
ప్రొసీడింగ్‌ పత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మండలంలోని కొండయ్యపల్లికి చెందిన నలుగురు, ఇస్లాంపూర్‌కు చెందిన ఇద్దరు, రంగరావుపల్లికి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరవగా మంగళవారం గంగాధర ప్రజా కార్యాలయంలో ప్రొసీడింగ్స్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంతరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పేరుతో పేదలను మోసం చేసిందన్నారు. అనంతరం ఈ నెల 29న గురు పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణకు రావాలని కొండగట్టు గిరిప్రదక్షిణ ప్రారంభికులు సురేష్‌ మహారాజ్‌ ఆత్మారాంజీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఆహ్వానించారు. నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు మంత్రి మహేందర్‌, మహిళా కాంగ్రెస్‌ మండలాధ్య క్షురాలు చిరుత మంగ, సింగిల్‌ విండో అధ్యక్షుడు వెలిచాల తిరుమల్‌రావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ముద్దం నగేష్‌, నాయకులు మనోహర్‌, సత్తు కనుకయ్య, గునుకొండ బాబు, సర్పంచులు వేముల భాస్కర్‌, బీర్ల ఆనంద్‌, బారాజు ప్రభాకర్‌ రెడ్డి, మల్యాల తిరుపతి, నాయకులు పడాల రాజన్న, దీకొండ మధు, బాపురెడ్డి, రాజ్‌గోపాల్‌రెడ్డి, వేముల అంజీ, పెంచాల చందు, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2026 | 12:05 AM