వంతెన నిర్మాణ పనులు సత్వరమే పూర్తి
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:23 AM
మండలంలోని అనంతారం గ్రామసమీపంలోని బిక్కవాగుపై ఉన్న అసంపూర్తి వంతెన నిర్మాణ పను లు సత్వరమే పూర్తిచేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు.
ఇల్లంతకుంట, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): మండలంలోని అనంతారం గ్రామసమీపంలోని బిక్కవాగుపై ఉన్న అసంపూర్తి వంతెన నిర్మాణ పను లు సత్వరమే పూర్తిచేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వంతెన పనులు పూర్తికాకపోవడం వల్ల ప్రయాణీకులు ఇబ్బంది పడుతు న్నారని తెలుసుకొని పనులు చేయిస్తామన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఇంటింటా అవగాహన కల్పించాలన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందినప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుంద న్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మామిడి రాజు, ప్యాక్స్ చైర్మన్ రమణా రెడ్డి, మాజీ ఎంపీపీ అయిలయ్య, టీపీసీసీ కోఆర్డీనేటర్ పాశం రాజేందర్ రెడ్డి, సర్పంచ్ వొల్లాల రజితవెంకటేశం, నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి, మహిళాకాంగ్రెస్ అధ్యక్షురాలు తీగల పుష్పలత, నాయకు లు మహేందర్‌రెడ్డి, బొల్లవేని రమేష్, నాయిని నవీన్‌కుమార్, నేరెళ్ళ విజ య్, కేశవరెడ్డి, గుండ వెంకటేశం, వెంకట్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, నాగయ్య, రవీం దర్‌రెడ్డి, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.