పిల్లల ఎదుగుదలకు తల్లిపాలు దోహదం..
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:09 AM
అప్పుడే పుట్టిన శిశువుకు తల్లి ముర్రుపాలు మొదటి టీకా అవుతుందని, పిల్లల ఎదుగుదలకు తల్లిపాలు దోహదపడుతాయని ఐసీడీఎస్ సీడీపీవో సబిత అన్నారు.
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : అప్పుడే పుట్టిన శిశువుకు తల్లి ముర్రుపాలు మొదటి టీకా అవుతుందని, పిల్లల ఎదుగుదలకు తల్లిపాలు దోహదపడుతాయని ఐసీడీఎస్ సీడీపీవో సబిత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం గణేష్‌నగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో సఖీ క్లస్టర్ ఆధ్వర్యంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ముందుగా ముఖ్య అతిథులు సీడీపీవో సబిత, స్థానిక సుందరయ్య నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు సాహితీ జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రాంభించారు. ఈ సందర్భంగా సీడీపీవో సబితా మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలకు తల్లిదండ్రులు పిల్లలను పంపించాలన్నారు. పిల్లలకు తల్లి పాలు శ్రేష్టమని, వారి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. పిల్లల ఆరోగ్య విషయాలలో నిర్ల క్ష్యం చేయవద్దని సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో చిన్నా రులకు అన్నప్రాసన మరికొందరు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిం చారు. అనంతరం తల్లిపాల వల్ల శిశువుకు, తల్లికి కలిగే ప్రయోజనాల ను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీవో ఉమారాణి, కౌన్సిలర్లు లింగంపల్లి గంగరాజు, ఎలుక వెంకటేశం, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ స్వప్న, సీవో వాణి, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్స్, అంగన్‌వాడీ టీచర్లు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.