Share News

తల్లి పాలలోనే అన్ని పోషకాలు

ABN , Publish Date - Aug 04 , 2026 | 11:57 PM

తల్లి పాలలోనే బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు ఉంటా యని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.

తల్లి పాలలోనే అన్ని పోషకాలు

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : తల్లి పాలలోనే బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు ఉంటా యని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన వైద్యశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లి పాల దినోత్సవానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి వద్దకు చేర్చాలని, ముర్రుపాలు ఇవ్వడంతో బాలింతకు అలాగే బిడ్డ ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్నారు. డెలివరీ అయిన మొదటి గంటలోనే బిడ్డకు తల్లి ముర్రుపాలు తప్పని సరిగా ఇవ్వాలన్నారు. అదే విధంగా మొదటి ఆరు నెలలు కూడా బిడ్డకు తల్లి పాలే ఇవ్వాలని సూచించారు. తల్లి పాలు పిల్లల ఎదుగుదల, బరువు పెరిగేందుకు ఉపయోగపడుతాయయన్నారు. బాలింతలు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చునని వివరించారు. వైద్యుల సూచనల మేరకు బాలింతలు ఆహారం తీసుకోవాలని ఎక్కువగా పోషకాహారం డ్రై ప్రూట్స్‌ తినాలను అన్నారు. పుట్టిన బిడ్డకు పాలు ఎలా ఇవ్వాలో తల్లికి శిక్షణ ఇవ్వాలని వైద్యులను ఆదేశించారు. ఈనెల 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల కేంద్రాలలో ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని సూచించారు. ఆశ వర్కర్లు తమ పరిధిలోని బాలింతలను కలిసి ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, పాలు ఇవ్వడం మందులు క్రమం తప్పకుండా తీసుకోవడంపై అవగాహన కల్పిస్తూ అందుబాటులో ఉండాలన్నారు. నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు తల్లి పాల ప్రాముఖ్యత, పాలు ఇచ్చే విధానం, బాలింతలు తీసుకోవల్సిని ఆహారంతో పాటు పలు అనుమానాలు అపోహలను వీడేలా నాటక రూపంలో బాలింతలకు అవగాహన కల్పించారు. అనంతరం బాలింతలకు జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పండ్లు పంపిణి చేసి తదనంతరం తల్లి పాల వారోత్సవాల వాల్‌ పోస్టర్‌ను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్‌, ఆసుపత్రి సూరింటెండెంట్‌ ప్రవీన్‌కుమార్‌, తహసీల్దార్‌ మహేష్‌కుమార్‌, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మిరాజం, మున్సిపల్‌ కమీషనర్‌ ఎండీ ఖాదీర్‌పాషా, వార్డు కౌన్పిలర్‌ గుండ్లపెల్లి నీరజ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2026 | 11:57 PM