Share News

అల్పాహారం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరం

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:12 AM

అల్పాహార పథకం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరం అని జిల్లా విద్యాధికారి విజయ్‌మోహన్‌ అన్నారు.

  అల్పాహారం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరం
మానకొండూర్‌లో అల్ఫాహరాన్ని పంపిణీ చేస్తున్న డిఈవో విజయ్‌మోహన్‌

మానకొండూర్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): అల్పాహార పథకం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరం అని జిల్లా విద్యాధికారి విజయ్‌మోహన్‌ అన్నారు. మానకొండూర్‌లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం అల్పాహార పథకం ద్వారా విద్యార్థులకు పోషకాహారం అందు తుందన్నారు. విద్యార్థుల హాజరు శాతం కూడా పెరుగుతుందన్నారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో ఈ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్‌ కో-ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌, మండల విద్యాధికారి ఆర్‌. శ్రీనివాస్‌, బాలికలు, బాలుర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జ్యోతి, శ్రీనివాస్‌ విద్యార్థులు ఉన్నారు.

Updated Date - Oct 24 , 2026 | 12:12 AM