బ్రహ్మోత్సవాలకు సమన్వయంతో పనిచేయాలి
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:06 AM
ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని శాఖాధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు.
ఇల్లందకుంట, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని శాఖాధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అన్ని శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ మాట్లాడారు. జిల్లాలో అతిపెద్ద దేవాలయంలో జరిగే బ్రహ్మోత్సవాల సమావేశానికి జిల్లా కలెక్టర్, సీపీ హాజరు కాకపోవడం చాలా బాధాకరమన్నారు. అసెంబ్లీ జరుగుతుండగా, భోజన విరామ సమయంలో తాను హైద్రాబాద్ నుంచి సమావేశానికి వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 16న జరుగాల్సి ఉన్న బ్రహ్మోత్సవాల సమన్వయ సమావేశాన్ని స్పీకర్ పర్మిషన్‌తో వాయిదా వేయించానని చెప్పారు. జాతర కొరకు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రూ.10లక్షలు ఇప్పించానని, కలెక్టర్ బ్రహ్మోత్సవాలకు డబ్బులు కేటాయించాలని కోరారు. స్వామివారి కల్యాణానికి దాదాపు లక్ష వరకు భక్తులు వస్తారని, అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో రమేష్‌బాబు, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ మాధవి, సర్పంచ్ దార సురేష్, చైర్మన్ ఇంగిలే రామారావు, తహసీల్దార్ భాస్కర్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నాయిని సుప్రియ, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు దిలీప్, ఈవో కందుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.