Share News

ముగిసిన బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:27 AM

జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్‌ వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఉదయం మహాపూర్ణాహుతి, చూర్ణోత్సవ, వసంతోత్సవాలు, చక్రస్నానం వైభవంగా జరిపారు.

ముగిసిన బ్రహ్మోత్సవాలు

కరీంనగర్‌ కల్చరల్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్‌ వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఉదయం మహాపూర్ణాహుతి, చూర్ణోత్సవ, వసంతోత్సవాలు, చక్రస్నానం వైభవంగా జరిపారు. సాయంత్రం నేత్రపర్వంగా శ్రీపుష్పయాగం, ద్వాదశారాధన, సప్తావరణాలు, ధ్వజావరోహణ, ఏకాంతసేవ నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ కుటుంబసభ్యులు, ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్‌, చకిలం గంగాధర్‌, ఈవె కందుల సుధాకర్‌, అర్చకులు లక్ష్మీనారాయణాచార్యులు, నాగరాజాచార్యులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 1న సాయంత్రం 6 గంటలకు మార్క్‌ఫెడ్‌ గ్రౌండ్‌ నుంచి శ్రీవారి శోభాయాత్ర జరుగనుంది.

ఫ లైవ్‌ కార్యక్రమాన్ని తిలకించిన మంత్రి పొన్నం....

యాగశాలలో జరిగే మహాపూర్ణాహుతి, చూర్ణోత్సవ, వసంతోత్సవ, చక్రస్నానాది కార్యక్రమాలను లైవ్‌ ద్వారా మంత్రి పొన్నం ప్రభాకర్‌ వీక్షించారు. ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ శ్రీవారి దయ ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఫిబ్రవరి 1న జరిగే శ్రీవారి శోభాయాత్రలో ప్రజలు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

Updated Date - Jan 30 , 2026 | 12:27 AM