Share News

సీతారామచంద్రస్వామి దేవాలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Apr 04 , 2026 | 12:20 AM

ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి సీతారామచంద్రస్వామి మూర్తుల ను ఆలయ ప్రధాన అర్చకుడు శేషం వంశీధరాచార్యులు ఆధ్వర్యంలో వేదబ్రాహ్మణుల మంత్రో చ్ఛరణల మధ్య అంగరంగ వైభవంగా చంద్రరథంపై (పెద్దరథం) అధిరోహించారు.

సీతారామచంద్రస్వామి దేవాలయంలో   వైభవంగా బ్రహ్మోత్సవాలు

ఇల్లందకుంట, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి సీతారామచంద్రస్వామి మూర్తుల ను ఆలయ ప్రధాన అర్చకుడు శేషం వంశీధరాచార్యులు ఆధ్వర్యంలో వేదబ్రాహ్మణుల మంత్రో చ్ఛరణల మధ్య అంగరంగ వైభవంగా చంద్రరథంపై (పెద్దరథం) అధిరోహించారు. సాయంత్రం నిత్యవిధి హోమం, రథబలి అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను, చంద్రరథాన్ని ఘనంగా అలంకరించారు. బజాబజంత్రిలు, మేళాతాళాలు, డప్పుచప్పుళ్ల నృత్యాలు చేస్తూ స్వామివారి ఉత్స మూర్తులను పల్లెకిలో అధిరోహించి చంద్రరథంపై తోడ్కుని వెళ్లి ఆసీనులను చేశారు. రాత్రి 10:30గంటల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు స్వామివారు చంద్రరథంపై ఆశీనులై భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం 4గంటలకు ఒగ్గు కళాకారుల ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తారు. తర్వాత భక్తుల జయజయఽ ద్వానాల మధ్య పెద్ద రథోత్సవం దేవస్థానం మాడవీధుల గుండా ఘనంగా ఊరేగింపుగా సాగుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ చైర్మన్‌ ఇంగిలే రామరావు, ఈవో సుధాకర్‌లతో పాటు ధర్మకర్తలు ఏర్పాట్లు నిర్వహించారు.

ఫ నేడు ప్రముఖుల రాక

ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా చంద్రరథంపై కొలువుదీరిన సీతారాములను దర్శించుకోవడానికి శనివారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌, స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దర్శించుకోనున్నారు. హుజూరాబాద్‌ ఏసీపీ వాసంశెట్టి మాధవి పర్యవేక్షణలో రూరల్‌ సీఐ లక్ష్మినారాయణ, ఎస్‌ఐ క్రాంతికుమార్‌లు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Apr 04 , 2026 | 12:20 AM