సైన్స్ ఫెయిర్‌తో సృజనాత్మకత పెంపు
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:03 AM
సైన్స్ ఫెయిర్ విద్యారు ల్లో సృజనాత్మకతతో పాటు పరిశీలనా శక్తిని పెంపొందుతుందని జిల్లా విద్యాధి కారి విజయ్‌సాగర్ అన్నారు.
వేములవాడ రూరల్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : సైన్స్ ఫెయిర్ విద్యారు ల్లో సృజనాత్మకతతో పాటు పరిశీలనా శక్తిని పెంపొందుతుందని జిల్లా విద్యాధి కారి విజయ్‌సాగర్ అన్నారు. మర్రిపల్లి గ్రామంలోని కేజీబీవీ పాఠశాలలో గురు వారం నిర్వహించిన సెన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సంద ర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను పరిశీలించారు. దాదాపు 330 మంది విద్యార్థులు శాస్ర్తీయ అంశాలపై రూపొందించిన ఆవిష్కరణలను నమూనాలను ప్రదర్శించారు. వాటి పనితీరును వివరించారు. అనంతరం డీఈ వో విజయ్‌సాగర్ మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్ కార్యక్రమం శాస్త్రీయ ఆలోచనలు, ప్రయోగాలు నమూనాలను ప్రదర్శించే వేదికగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్ర మం ద్వారా విద్యార్థుల్లో స్నేహభావం పెంపొందుతుందన్నారు. బాలికలకు సమాజంలో సమాన అవకాశాలు కల్పించడం ద్వారా భవిష్యత్తులో వారు కీలక పాత్ర పోషిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ సీడీపీవో సౌందర్య, ఉమారాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి కవిత, జీసీడీవో పద్మ, మండల విద్యాధికారి కిషన్, ఎస్‌వో ఆశ్రిత, ఎన్జీవో కోఆర్డినేటర్ లహరి, మమత, హరిబా బు, ప్రశాంత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.