బీఎల్‌వోలు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలి
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:19 AM
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్పెషల్ ఇం టెన్సివ్ రివిజన్(సర్) ఓటర్ జాబితాతో బూత్ లెవెల్ అధికారులు (బీఎల్‌వోలు)తమ పరిధిలో ని ఇంటింటికి వెళ్లి పరిశీలించాలని అదనపు కలె క్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.
చందుర్తి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్పెషల్ ఇం టెన్సివ్ రివిజన్(సర్) ఓటర్ జాబితాతో బూత్ లెవెల్ అధికారులు (బీఎల్‌వోలు)తమ పరిధిలో ని ఇంటింటికి వెళ్లి పరిశీలించాలని అదనపు కలె క్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సర్ ప్రక్రియ తది తర అంశాలపై చందుర్తి తహసీల్ కార్యాల యంలో రెవెన్యూ అధికారులు, సూపర్వైజర్లు, బీఎల్‌వోలతో గురువారం సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడారు. ఎస్‌ఎస్‌ఆర్-2025 జాబితా లో 40ఏళ్లకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిని ఎస్‌ఐఆర్-2002 జాబితాతో మ్యాపింగ్ బూత్ స్థాయిలో పూర్తిచేయాలని, రెండు జాబి తాలో ఉన్న కామన్ వ్యక్తులకు ఎస్‌ఐ ఆర్ వర్తించదని తెలిపారు. ఎస్‌ఐఆర్ నిర్వహణ కంటే ముందు ప్రతి పోలిం గ్ బూత్ స్థాయిలో 2002 ఎస్‌ఐఆర్ డేటాను 2025 ఎస్‌ఎస్‌ఆర్ డేటాతో పోల్చి చూసుకోవాలని, ఈ రెండు జాబి తాలో కామన్‌గా ఉన్న పేర్లు మినహా యించి 2002 తర్వాత ఓటరుగా నమో దైన వారి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధృవీకరించాల్సి ఉంటుందని తెలిపారు.
స్టేడియం నిర్మాణ స్థలం పరిశీలన
చందుర్తి మండలంలోని మూడపల్లి గ్రామం లో మినీ స్టేడియం నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ గురువారం పరిశీలించారు. మొత్తం ఎన్ని ఎక రాలు కేటాయించారని అధికారులను ఆరా తీయగా, మొత్తం ఆరు ఎకరాలు కేటాయిం చారని అదనపు కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకువెళ్ళారు. పరిశీలనలో తహసీల్దార్ భూప తి, ఆర్‌ఐలు మహేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు