Share News

ఓటు చోరీ కాకుండా బీఎల్‌వోలు చొరవచూపాలి

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:02 AM

ఓటు చోరీ కాకుండా బీఎల్‌వోలు చొరవచూపాలని వెలమ కార్పొరేషన రాష్ట్ర చైర్మన్‌ జువ్వాడి నర్సింగరావు సూచించారు.

ఓటు చోరీ కాకుండా బీఎల్‌వోలు చొరవచూపాలి
ఓటర్‌ జాబితా కిట్లను ప్రదర్శిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

- వెలమ కార్పొరేషన చైర్మన్‌ జువ్వాడి నర్సింగరావు

కోరుట్ల, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి) : ఓటు చోరీ కాకుండా బీఎల్‌వోలు చొరవచూపాలని వెలమ కార్పొరేషన రాష్ట్ర చైర్మన్‌ జువ్వాడి నర్సింగరావు సూచించారు. పట్టణంలోని ఓ ఫంక్షనహాల్‌లో శుక్రవారం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై బీల్‌వోలకు అవగాహన సదస్సును పరిశీలకుడు రుద్ర సంతోష్‌తో ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు పలు రాషా్ట్రల్లో ఎన్నికల సంఘం అధికారులు నిర్వహించిన సర్‌ కార్యక్రమంలో లక్షలాది మంది ఓట్లు గల్లంతయ్యయన్నారు. బీఎల్‌వోలు ప్రత్యేక శ్రద్ధ వహించి అర్హులైన వారి ఓట్లు రద్దు కాకుండా చూడాలని కోరారు. బీఎల్‌వోలకు ప్రత్యేక సమగ్ర సవరణపై రూపోదించిన కరపత్రంతో పాటు కిట్లను పంపిణీ చేశారు. ఓటర్‌ సమగ్ర సవరణపై పరిశీలకుడు రుద్ర సంతోష్‌ బీఎల్‌వోలకు వివరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నందయ్య, పీసీసీ సహాయ కార్యధర్శి బండా శంకర్‌, కోరుట్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, పట్టణ అధ్యక్షుడు తిరుమల వసంతగంగాధర్‌, కోరుట్ల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, మండల అధ్యక్షుడు పన్నాల అంజిరెడ్డి, మెట్‌పల్లి పట్టణ అధ్యక్షుడు రైసోద్దిన్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జువ్వాడి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 12:02 AM