బీఎల్‌వోలు తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లాలి
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:52 AM
ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియలో భాగంగా బూత స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) తప్పనిసరిగా క్షేత్రస్థాయి కి వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శనరెడ్డి ఆదేశించారు.
- రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శనరెడ్డి
సిరిసిల్ల అర్బన, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియలో భాగంగా బూత స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) తప్పనిసరిగా క్షేత్రస్థాయి కి వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శనరెడ్డి ఆదేశించారు. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ, తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శనరెడ్డి శనివారం వివిధ జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శనరెడ్డి మాట్లాడుతూ.. ఓటరు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని ఆదేశించారు. 2002 వివరాలతో, ప్రస్తుత వివరాలు సరి పోల్చి మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. బూత స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) తప్పనిసరిగా క్షేతత్రస్థాయిలో వెళ్లి ప్రక్రియను చేప ట్టాలని తెలిపారు. ఇంటింటికీ వెళ్లాలని స్పష్టం చేశారు. బీఎల్‌వోలు రోజువారీగా చేపట్టి ప్రోజెని మ్యాపింగ్ వివరాలను తమకు అందిస్తూ ఉండాలని పేర్కొన్నారు. బీఎల్‌వోలకు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియ నిర్వహణలో ఏబీఎల్‌వోలు సహకారం అందించేలా చర్యలు తీసుకోవా లని సూచించారు. ఎక్కడైనా పోలింగ్ బూతలలో ఈ ప్ర క్రియలో ఇబ్బందులు ఎదురైతే సంబంధిత బూతలకు చెందిన బీఎల్‌వోలు సమన్వయం చేసుకుంటే ఇబ్బందు లు తొలగుతాయని వివరించారు. నిర్ణీత గడువులోగా ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. మ్యాపింగ్ ప్రక్రియలో తప్పులు జరగకుండా చూడాలని ఆదేశించారు. ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. వీడియోకాన్ఫరెన్సలో రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ నుంచి ఇనచార్జి కలెక్టర్ గరిమ , అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గడ్డం నగేష్, సిరిసిల్ల, వే ములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రెండోవిడత ర్యాండమైజేషన ప్రక్రియ పూర్తి
- ఇనచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల అర్బన (ఆంఽధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలిం గ్ సిబ్బందికి రెండోవిడత ర్యాండమైజేషన ప్రక్రి యను పూర్తిచేయడం జరిగిందని జిల్లా ఇనచా ర్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ తెలిపారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో శని వారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి మున్సిపల్ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో జిల్లా ఇనచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ రెండో విడుత ర్యాం డమైజేషన ప్రక్రియను పూర్తిచేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, నోడల్ అధికారులు శ్రీని వాసచారి, జగనమోహనరెడ్డి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, ఏంఏ భారతి, ప్రవీణ్ పాల్గొన్నారు.