Share News

రక్తదానం ప్రాణదానంతో సమానం

ABN , Publish Date - Oct 27 , 2026 | 11:52 PM

ఆపదలో ఉన్నవారికి రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతీఒక్కరూ స్వచ్ఛందంగా రక్త దానం చేయాలని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.

రక్తదానం ప్రాణదానంతో సమానం

వేములవాడ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆపదలో ఉన్నవారికి రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతీఒక్కరూ స్వచ్ఛందంగా రక్త దానం చేయాలని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజున వేములవాడ పట్టణంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎస్పీ మహేష్‌ బి గితేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ దేశ రక్షణ, అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్ష ణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి న పోలీస్‌ అమరవీరుల సేవలు మరువలేనివని అన్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారో త్సవాలు వారి త్యాగాల ను గుర్తు చేసుకోవడమే కాకుండా, సమాజంపై సేవాభావం, బాధ్యతను పెంపొందించుకునేం దుకు స్పూర్తినిస్తాయని తెలిపారు. అనంతరం ఎస్పీ మహేష్‌ బి గితే మాట్లాడుతూ ప్రాణత్యా గాలను స్మరించుకుంటూ అక్టోబరు 21 నుంచి పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా వేములవాడలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశా మని తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాన శిబి రంలో పోలీసు అధికారులు, సిబ్బంది, యువత, మీడియా ప్రతినిధులు 400మంది స్వచ్ఛందం గా రక్తదానం చేసి మానవతా దృక్పఽథాన్ని చాటుకున్నారని వివరించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీలు శ్రీనివాసులు, నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు, సీఐలు వీరప్రసాద్‌, శ్రీనివాస్‌, రవీందర్‌, రవి, నాగేశ్వరరావు, మున్సి పల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, వైస్‌చైర్మన్‌ నరాల శేఖర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 27 , 2026 | 11:52 PM