బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:31 AM
ఎస్‌ఐఆర్ ప్రక్రి యలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) : ఎస్‌ఐఆర్ ప్రక్రి యలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎస్‌ఐఆర్ నియో జకవర్గం ఇన్‌చార్జి ఫక్రుదీన్ సమక్షంలో ఎస్‌ఐఆర్ రెండవ విడత ప్రక్రియ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, ఫక్రుద్దీన్ మాట్లాడారు. ఎస్‌ఐఆర్ మొ దటి ప్రక్రియలో ఓటర్ల సవరణలో బీఎల్వోలు ప్రతి ఇంటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారంలు అందజేశారన్నారు. నిర్ణీత సమయంలో తిరిగి కలెక్ట్ చేసుకున్నారని, ఎన్యూమరేషన్ ఫారంలు ఇవ్వడంలో విఫలమైన వారు పరిగణనలోకి రాలేద న్నారు. మరికొంతమంది ఓటర్లు వారి పాత చిరునామాల్లో కాకుం డా వేరే ప్రాంతంలో నివాసం ఉంటూ ఎన్యూమరేషన్ ఫారంలు అందజేయడంలో విఫలమయ్యారని వివరించారు. ఈ ప్రక్రియలో ఓటర్లు ఒకటికి మించిన ఓట్లు కలిగి ఉన్న వారికి ఒకటే చోట తమ ఓటు పొందేందుకు అవకాశం కల్పించారన్నారు. మరణిం చిన వివరాలు నమోదైనందున వారిని వేరుచేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక జాబితాను ప్రకటించిందని వెల్లడించారు. ఓటర్ల జాబితా చూసిన తర్వాత ప్రతి బూతులో 100 నుంచి 200 మంది ఓటర్ల వివరాలను గల్లంతయ్యాయని అన్నారు. మరికొంత మంది ఓటర్ల వివరాలు అచ్చు తప్పులు ఉండటం అనుమానా స్పదంగా వివరాలు ఉన్న ఓటర్లకు ఇప్పటికే అధికారులు నోటీ సులు జారీ చేశారని అన్నారు. అభ్యంతరాల ఓటర్లను తొగించిన తరువాత ప్రకటించిన ఓటర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ బీఎల్‌వో లకు అందించారన్నారు. స్థానికంగా లేనివారు, చనిపోయిన వారు ఒకటికి మించిన ఓట్లు కలిగి ఉన్నవారు, అచ్చుతప్పులతో వివరా లు నమోదు అయినవారిని ప్రతి ఇంటికి తిరిగి వారిని గుర్తించి సమస్యాత్మకంగా ఉన్న వివరాలను సరిచేస్తూ అర్హులైన ఓటర్లకు ఓటు హక్కుల కల్పించాల్సిన బాధ్యత బీఎల్‌ఏలపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున ఉన్న బూత్ లెవల్ ఏజెంట్లు ప్రతిరోజు కనీసం 30 ఇళ్లు తిరుగుతూ వివరాలు సరిగా నమోదు కాని వారిని గుర్తించి సమగ్రమైన ఓటర్ల వివరాలను బీఎల్‌వోలకు అందజేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ముఖ్యమైనదేనని అన్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో 60 లక్షలకు పైగా ఓట్లు తొలగించబడ్డాయని, దీంతో ప్రభుత్వ మార్పు తప్పలేదన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటు కూడా ఎన్నికల జాబితాలో నుంచి తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ఆకునూరి బాలరాజు, నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాల అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారు.