మహిళా లోకానికి బ్లాక్ డే ...
ABN , Publish Date - Apr 18 , 2026 | 11:47 PM
మహిళా లోకానికి ఏప్రిల్ 17 బ్లాక్‌డే అని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, ఇండియా కూటమి అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కరీంనగర్ బీజేపీ శ్రేణులు తెలంగాణ చౌక్‌లో శనివారం నిరసన తెలిపారు.
గణేశ్‌నగర్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): మహిళా లోకానికి ఏప్రిల్ 17 బ్లాక్‌డే అని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, ఇండియా కూటమి అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కరీంనగర్ బీజేపీ శ్రేణులు తెలంగాణ చౌక్‌లో శనివారం నిరసన తెలిపారు. కాంగ్రెస్, ఇండియా కూటమికి వ్యతిరేకంగా ఈ సందర్భంగానినాదాలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పార్లమెంటులో కాంగ్రెస్, ఇండియా కూటమి మహిళా బిల్లును వ్యతిరేకించిన విధానంపై మండిపడ్డారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తామంటే హర్షించాల్సిన ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేసి బిల్లును అడ్డుకొని వీగిపోయేలా చేయడం సరికాదన్నారు. మహిళలపై కాంగ్రెస్, ఇండియా కూటమికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఈ బిల్లు అంశంతో తేటతెల్లమైందన్నారు. కాంగ్రెస్, ఇండియా కూటమి మహిళా లోకానికి తీవ్ర అన్యాయం చేశాయన్నారు. మహిళా బిల్లును వ్యతిరేకించి కాంగ్రెస్, ఇండియా కూటమి చరిత్రలో మహిళా ద్రోహులుగా మిగిలిపోయారని విమర్శించారు. మహిళలను చట్టసభల్లోకి రాకుండా అడ్డుకోవడం కాంగ్రెస్‌కే చెల్లిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయని మండిపడ్డారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.