Share News

బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:17 AM

బీజేపీ సిద్ధాంతాన్ని, భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రశిక్షణ కమిటీ సభ్యులు రంజిత్‌ మోహన్‌ పిలుపునిచ్చారు. పండిత్‌ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్‌లో భాగంగా వెస్ట్‌ జోన్‌, కొత్తపల్లి జోన్‌, కొత్తపల్లి రూరల్‌ బీజేపీ శ్రేణుల రెండు రోజుల శిక్షణ శిబిరం కొత్తపల్లిలో నిర్వహించారు.

బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నేతలు రంజిత్‌ మోహన్‌, పోరెడ్డి శ్రీధర్‌, రాణి రుద్రమ

భగత్‌నగర్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): బీజేపీ సిద్ధాంతాన్ని, భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రశిక్షణ కమిటీ సభ్యులు రంజిత్‌ మోహన్‌ పిలుపునిచ్చారు. పండిత్‌ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్‌లో భాగంగా వెస్ట్‌ జోన్‌, కొత్తపల్లి జోన్‌, కొత్తపల్లి రూరల్‌ బీజేపీ శ్రేణుల రెండు రోజుల శిక్షణ శిబిరం కొత్తపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలమైన సిద్ధాంతంతోనే నేడు పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించిందన్నారు. పార్టీని బూత్‌ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేయాలన్నారు. ఆదివారం శిక్షణ శిబిరం ముగిసిన అనంతరం పార్టీ శ్రేణులు ప్రధాని మోడీ 131వ మన్‌ కి బాత్‌ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి శ్రీధర్‌, రాణి రుద్రమ బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు, సీనియర్‌ నాయకులు కన్నబోయిన ఓదెలు, గుజ్జ శ్రీనివాస్‌, రాష్ట్ర నాయకులు కార్పొరేటర్‌ వాసాల రమేష్‌, జిల్లా ఉపాధ్యక్షులు రంగు భాస్కరచారి కొత్తపల్లి జోన్‌ అధ్యక్షుడు ముత్తునూరి హరీష్‌ రావు, వెస్ట్‌జోన్‌ అధ్యక్షుడు జాడి బాల్‌రెడ్డి, కొత్తపల్లి రూరల్‌ మండలాధ్యక్షుడు కుంట తిరుపతి పాల్గొన్నారు.

ఫ కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి

కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పండిత్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్‌ శిక్షణలో భాగంగా కరీంనగర్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ , సౌత్‌ జోన్‌ శ్రేణులకు కరీంనగర్‌లో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం రోజు శిక్షణ ముగింపు (సమారోప్‌) కార్యక్రమానికి బీజీపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బిజపార్టీ సిద్ధాంతాలను, భావాజాలన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, ప్రజలతో నిరంతరం మమేకం కావాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు వై సునీల్‌ రావు, పోరెడ్డి శ్రీధర్‌, రాష్ట్ర ప్రశిక్షణ కమిటీ సభ్యులు రంజిత్‌ మోహన్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుగ్గిల్లపు రమేష్‌, జిల్లా ఉపాధ్యక్షుడు కళ్లెం వాసుదేవరెడ్డి , సీనియర్‌ నాయకులు విద్యాసాగర్‌ , మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు సమీ పర్వేజ్‌, నగర కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2026 | 12:17 AM