రైతులపై బీజేపీ కపట ప్రేమ
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:33 AM
బీజేపీ రైతు లపై కపట ప్రేమ వలకబోస్తుందని, బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు రైతుల పేరు చెప్పి కల్లాల బాట పడుతున్నారని, కానీ ఢిల్లీ బాట పట్టాలని ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ అన్నా రు.
సిరిసిల్ల, జూన్ 2 ((ఆంధ్రజ్యోతి) : బీజేపీ రైతు లపై కపట ప్రేమ వలకబోస్తుందని, బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు రైతుల పేరు చెప్పి కల్లాల బాట పడుతున్నారని, కానీ ఢిల్లీ బాట పట్టాలని ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ అన్నా రు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల మార్కెట్ యార్డ్, ఆపెరల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన గోదాముల్లో ధాన్యం దిగుమతిని అదనపు కలెక్టర్ నగేష్‌తో కలిసి పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుంచి పరిమిత పరిమాణానికే మద్దతు ధర కొనుగోలు చేస్తామని కేంద్రం చెప్పడం సరి కాదని, రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజ ను మద్దతు ధరకే కొనుగోలు చేయాల్సిన బాధ్య త కేంద్రానిదేనని అన్నారు. రైతుల సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో కేంద్రంపై ఒత్తి డితేవాలని, రాజకీయ ప్రయోజనాల కోసం రైతు లను ఉపయోగించుకోవద్దని విమర్శించారు. బీజే పీ ఎంపీలు నరేంద్ర మోదీని తెలంగాణలో రైతు లు పండించిన పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఒత్తిడి తేవాలని అన్నారు. ఇద్దరి కేంద్ర మంత్రులు, ఎంపీలు అందరూ కలిసి నరేంద్ర మోదీ ఇంటి ఎదుట ధర్నా చేసి రాష్ట్రంలో పండి న పూర్తి ధ్యానాన్ని కొనుగోలు చేసేలా చూడాల న్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల కోసం ఏం చేయడం లేదన్నారు. కనీసం వారి పాలిత రాష్ట్రాల్లో రైతుల రుణమాఫీ చేయలేదని అన్నా రు. ఎల్లప్పడూ రైతు పక్షపాత కాంగ్రెస్ ప్రభు త్వమని, రైతు ప్రయోజనాల పరిరక్షణలో వెను కడుగు వేయదని పేర్కొన్నారు. రైతుల సంక్షే మం, ధాన్యం కొనుగోలు, మద్దతు ధర అమలు, సాగు మౌలిక వసతుల బలోపేతం విషయాల్లో ప్రభుత్వం కట్టుబడి కొనసాగుతుందని తెలి పారు. రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. జిల్లావ్యాప్తం గా రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభు త్వం మద్దతు ధరకే కొనుగోలు చేయడానికి జిల్లా యంత్రాంగం సమన్వయంతో విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈసా రి వరి దిగుబడి గణనీయంగా పెరిగినప్పటికీ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్య లు చేపడుతోందన్నారు. కొనుగోలు కేంద్రాలవద్ద, రైస్ మిల్లర్ల వద్ద, గోదాముల వద్ద ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. రైస్ మిల్లుల్లో స్థలాభావం లేదా గోదాముల్లో నిల్వ సమస్యలు తలెత్తిన సందర్భాల్లో కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యా మ్నాయ నిల్వ సదుపాయాలు కల్పించి ధాన్యా న్ని వెంటనే తరలించేలా చర్యలు తీసుకుంటు న్నట్లు తెలిపారు. అవసరమైన చోట్ల గోదాము లు, నిల్వ కేంద్రాలు వినియోగంలోకి తెచ్చి రైతు లకు ఇబ్బందులు లేకుండా వ్యవస్థను నడిపిస్తు న్నామని వివరించారు. ఇటీవలి అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్య బస్తాలను కూడా ప్రభుత్వం యథావిధిగా స్వీకరించి రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుందని, రైతు కష్టానికి తగిన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తు న్నామని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల్లోపు చెల్లింపులు జరిగేలా ప్రభు త్వం చర్యలు తీసుకుం టోందని స్పష్టం చేశారు. మద్దతు ధర కొనుగోలులో ఎక్కడా జాప్యం లేకుండా, రైతుకు ఇబ్బంది కలగకుం డా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో పని చేస్తోందన్నారు.
రైతులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్న కేటీఆర్
వ్యవసాయనికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్న ట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆది శ్రీనివాస్ విమర్శించారు. వ్యవసాయనికి మూడు గంటల విద్యుత్ చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎప్పు డూ చెప్పలేదని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకం గానే కేటీఆర్ తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ రైతు లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నా రన్నారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయానికి 12 గంటలకు మించి విద్యుత్ అందిన సందర్భాలు లేవని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్‌ను కొన సాగిస్తామని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించారని చెప్పారు. మోటార్లకు మీటర్లు పెడితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని సీఎం సవాల్ విసిరారని, అయితే ఒకవేళ మీటర్లు పెట్టకపోతే బీఆర్‌ఎస్ రాజకీయాల నుంచి తప్పుకుంటుందా అనే ప్రశ్న కు కేటీఆర్ సమాధానం చెప్పడం లేదని విమ ర్శించారు. తెలంగాణలో రైతు ప్రభుత్వం కొనసా గుతోందని తెలిపారు.