Share News

నచ్చని ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర

ABN , Publish Date - Jun 25 , 2026 | 11:57 PM

బీజేపీ ప్రభుత్వం బెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా లేని వారి ఓట్లను లక్షల్లో తొలగించిందని, తెలంగాణ రాష్ట్రంలో సైతం ఓట్లను తొలగించే ప్రయ త్నాలు జరుగుతున్నాయని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆరోపించారు.

నచ్చని ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర

వేములవాడ, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ప్రభుత్వం బెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా లేని వారి ఓట్లను లక్షల్లో తొలగించిందని, తెలంగాణ రాష్ట్రంలో సైతం ఓట్లను తొలగించే ప్రయ త్నాలు జరుగుతున్నాయని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆరోపించారు. వేములవాడ మండలం చింతలఠాణ గ్రామంలో గురువారం బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు సర్‌ కార్యక్రమంపై అవగాహన సమావేశాన్ని నిర్వ హించారు. కార్యక్రమానికి హాజరైన ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ 2002 లో చేపట్టిన ఓటరు జాబితా సవరణ కార్యక్రమం తరహాలోనే ప్రస్తు తం ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. బీఎల్‌వో లు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవసరమైన సహకారం అందించా లని సూచించారు. ప్రతి ఒక్కరు తమ ఓటు బీఎల్‌వోల వద్ద ఉన్న ఓట రు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ సర్పంచులు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు సామాజిక బాధ్యతగా గ్రామాల్లో ప్రజలకు ఓటరు జాబితాపై అవగా హన కల్పించాలని తెలిపారు. ఓటరు జాబితాలో ఏదైనా కారణంతో పేరు లేకపోతే సంబంధిత దరఖాస్తు ఫారాన్ని నింపి గ్రామ, మండల, జిల్లాస్థాయి అధికారులకు సమర్పించేలా ప్రజలకు మార్గనిర్ధేశం చేయా లని సూచించారు. గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వారు, విదేశాల్లో చదువుతున్న వారి వివరాలను కుటుంబ సభ్యులు బీఎల్‌ఏలకు అందించాలన్నారు. అవసరమైతే కుటుంబ సభ్యులు అఫిడవిట్‌ రూపంలో సంబంధిత అధి కారులకు వివరాలు సమర్పించాలని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే అన్ని గ్రామాల్లో డప్పు చాటింపు, మైక్‌ ప్రకటనల ద్వారా ఓట రు జాబితా సవరణపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. చాలా గ్రామా ల్లో ఇప్పటికే 80శాతం పైగా ఓటరు మ్యాపింగ్‌ పూర్తయిందని, ఇటీవల నియోజకవర్గ స్థాయిలో బీఎల్‌ఏలకు శిక్షణ శిబిరాలు కూడా నిర్వహిం చామని చెప్పారు. బీజేపీ ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ప్రతి పక్షాలకు చెందిన ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బెంగాల్‌, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బీజేపీకి నచ్చని వారి ఓట్లను లక్షల సంఖ్యలో తొలగించే ప్రయత్నాలు జరిగాయని, తెలంగాణలో కూడా సుమారుగా 80 లక్షల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రజలు ఎట్టి పరిస్థితిల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా తమ ఓటు జాబితాలో ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోవాలని, ఓటు హక్కును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు పిల్లి కనుకయ్య, ఎర్రం రాజు, గాలిపెల్లి స్వామి, పండుగ ప్రదీప్‌, చొక్కాల రాము, ఇటీక్యాల రాజు, కదిరే రాజు, కొమురవ్వ తదితరులు ఉన్నారు.

పేదల సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యం

పేదల సొంతింటి కలను నిజం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ మండలం చింతలఠాణలో ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆది శ్రీనివాస్‌ హాజరై లబ్ధిదారులకు నూతన వస్ర్తాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 25 , 2026 | 11:57 PM