రైతుల దీక్షకు బీజేపీ నాయకుల సంఘీభావం
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:26 AM
రైతులు నిరసన దీక్ష చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం అని బీజేపీ మండలశాఖ అధ్యక్షుడు భూమల్ల అనీల్‌కుమార్ పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి) : రైతులు నిరసన దీక్ష చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం అని బీజేపీ మండలశాఖ అధ్యక్షుడు భూమల్ల అనీల్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామసమీపంలో రైతులు చేపట్టిన నిరసనదీక్ష బుధవారానికి 9వ రోజుకు చేరుకుంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెప్నడమే తప్ప వారి సమస్యలు తీర్చడం లేదన్నారు. ప్రభుత్వం ఇంతవరకు కనీసం పెట్టుబడి సాయం అందివ్వలేదని విమర్శించారు. రైతులకు అండగా బీజేపీ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మారవేని రాజు, రైతులు కరికె నవీన్‌కుమార్, పయ్యావుల బాలయ్య, గాదె మధుసూదన్, దేవరాజు, రాజు, నర్సయ్య, పర్శరాం, శ్రీనివాస్, ఎల్లం, కనుకయ్య, మోహన్, మల్లేశం, రవి తదితరులు పాల్గొన్నారు.