భక్తులతో సందడిగా మారిన భీమన్న ఆలయం
ABN , Publish Date - Apr 13 , 2026 | 12:55 AM
వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో సందడిగా మారింది.
వేములవాడ, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో సందడిగా మారింది. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు శనివారం రాత్రి ఆలయానికి తరలివచ్చారు. తలనీలాలు సమర్పించుకున్న భక్తులు పవిత్రస్నానాలను ఆచరించారు. ధర్మదర్శనం, కోడెమొక్కు క్యూలైన్‌ల ద్వారా భక్తులకు ఆలయంలోకి చేరుకుని భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కోడెమొక్కులు చెల్లించుకున్నారు. గాయాత్రి అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజలో పాల్గొన్నారు.