Share News

గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ

ABN , Publish Date - May 23 , 2026 | 12:24 AM

దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ అని కలెక్టర్‌ చిత్రామిశ్రా కొనియాడారు.

గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ
భాగ్యరెడ్డి వర్మ విగ్రహానికి పూలమాల వేస్తున్న కలెక్టర్‌ చిత్రమిశ్రా

సుభాష్‌నగర్‌, మే 22(ఆంధ్రజ్యోతి): దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ అని కలెక్టర్‌ చిత్రామిశ్రా కొనియాడారు. శుక్రవారం భాగ్యరెడ్డి వర్మ 138వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన భాగ్యరెడ్డి వర్మ విగ్రహానికి సుడా చైర్మెన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, వివిద సంఘాల నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి, దళిత మహిళల విద్యకు, ప్రగతికి భాగ్యరెడ్డి వర్మ ఎనలేని కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్‌ సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారని కొనియాడారు. భాగ్యరెడ్డి వర్మ అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో మహేశ్వర్‌, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి అనిల్‌ ప్రకాశ్‌, వివిధ శాఖల అధికారులు, దళిత సంఘాల నాయకులు బూర్గుల వెంకటేశ్వర్లు, మేడి మహేశ్‌, జంజీరపు ఎల్లెశ్‌, నాయని ప్రసాద్‌, రుద్రభట్ల తిలక్‌రాజు, ఎర్రల కవిత, బైరం కుమార్‌, గొర్రె శ్రీనివాస్‌, గీస శ్రీనివాస్‌, బూర రేణుక, నిజాంపేట శ్రీనివాస్‌, జంగ అపర్ణ, రోడ్‌ ఆంజనేయులు, కోడి పరమేశ్‌, బూర పరశురాం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2026 | 12:24 AM