Share News

భగ్గుమన్న భానుడు

ABN , Publish Date - May 02 , 2026 | 01:19 AM

ఎండలు మండిపోతున్నాయి. వారంరోజులుగా భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్‌ చివరి వారం నుంచి మొదలైన ఎండల తీవ్రత రోజురోజుకు అధికమవుతుండడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. గత వారం రోజుల నుంచి జిల్లా సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైబడి ఉండగా, జిల్లాలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలపైబడి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి.

 భగ్గుమన్న భానుడు

- మండుతున్న ఎండలతో జనం విలవిల

- నిర్మాణుష్యంగా రోడ్లు

- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

కరీంనగర్‌ టౌన్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): ఎండలు మండిపోతున్నాయి. వారంరోజులుగా భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్‌ చివరి వారం నుంచి మొదలైన ఎండల తీవ్రత రోజురోజుకు అధికమవుతుండడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. గత వారం రోజుల నుంచి జిల్లా సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైబడి ఉండగా, జిల్లాలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలపైబడి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. దీంతో కార్మికులు, కర్షకులు, చిరువ్యాపారులు, వీధివ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. ఎండల తీవ్రతను తట్టుకునేందుకు యాతన పడుతున్నారు. అత్యవసరమైతే తప్ప జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. దీనితో జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు, మార్కెట్లు, బస్టాండ్లు, జంక్షన్లు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్మాణుష్యంగా మారుతున్నాయి. తప్పనిసరి బయటకు వెళ్లాల్సి వచ్చిన వారు రక్షణ చర్యలు తీసుకోవడమేకాకుండా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాల, చెరుకు రసం వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటున్నారు. మే, జూన్‌ నెలల్లో ఎల్‌నినో ప్రభావంతో ఎండలు మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెపుతోంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, వడగాల్పులు ఎక్కువగా వీచే అవకాశాలున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పెళ్లిళ్లు, ఇతరత్రా ఫంక్షన్లకు వెళ్లే వారు కూడా ఆలోచించి వెళ్తుండగా నిర్వాహకులు ఏసీలు, కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు. మే మొదటి వారంలోనే ఈ పరిస్థితి ఇలా ఉంటే ఇక దాదాపు 45 రోజులు గడి చేదెలా అంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 02 , 2026 | 01:19 AM