రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి
ABN , Publish Date - Aug 19 , 2026 | 12:19 AM
ఆసుపత్రికి వచ్చేవారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి ఆంజెలా ఆల్ర్ఫెడ్ సూచించారు.
ఇల్లంతకుంట, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : ఆసుపత్రికి వచ్చేవారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి ఆంజెలా ఆల్ర్ఫెడ్ సూచించారు. ఇల్లంతకుంట మండలం లోని పెద్దలింగాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వైద్యసేవలు, మందుల నిల్వలు, సిబ్బంది హాజరును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతు ప్రభుత్వం అందిస్తున్న వైద్యసేవలను ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకు నేలా సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాలలో పరి శుభ్రత, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రొగ్రాం అధికారి డాక్టర్ రాంరెడ్డి, వైద్యాధికారులు జీవన్‌జ్యోతి, ప్రేమ్‌కుమార్, మహేష్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట : వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ర్ఫైడ్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఆరోగ్య ఉపకేంద్రాన్ని మంగళవారం ఆమె తనిఖీ చేశారు. కేంద్రంలోని రికార్డులు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల నిల్వ, సిబ్బంది హాజరును పరిశీలించారు. నిత్యం కేంద్రంలో ఎంత మందికి వైద్య సేవలు అందిస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బాలింతలు, గర్భిణీలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేసి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ర్ఫైడ్ హెచ్చరించారు. నిత్యం రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆమె వెంట ప్రోగాం అధికారి రాంరెడ్డి ఉన్నారు.