మెరుగైన వైద్య సేవలందించాలి
ABN , Publish Date - Jan 31 , 2026 | 12:16 AM
వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా వైద్యాధికారి రజిత అన్నారు.
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి, జనవరి30(ఆంధ్రజ్యోతి): వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా వైద్యాధికారి రజిత అన్నారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండల కేంద్రాల్లోని పీహెచ్‌సీలను శుక్రవారం ఆమె తనిఖీలు నిర్వహించారు. కేంద్రాల పరిసరాలు, సిబ్బంది హాజ రురిజిష్టరు, ఆసుపత్రుల్లోని గదులు, మందుల నిల్వను పరిశీలించారు. ఎల్లారెడ్డిపేటలోని పీహెచ్‌సీలో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలకు చెందిన వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని అన్నారు. వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని అన్నారు. ఆమె వెంట జిల్లా డేటా మేనేజర్ కార్తీక్, మండల వైద్యాధికారి సరియాఅంజుమ్, బాలకిషన్, తదితరులు ఉన్నారు.