Share News

మెరుగైన వైద్యం అందించాలి

ABN , Publish Date - Nov 19 , 2026 | 11:58 PM

వైద్యులు, సిబ్బంది అందుబాటు లో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ ఆదేశించారు.

మెరుగైన వైద్యం అందించాలి

సిరిసిల్ల, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): వైద్యులు, సిబ్బంది అందుబాటు లో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ ఆదేశించారు. గురువారం సిరిసిల్ల అంబేద్కర్‌నగర్‌ అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రతిరోజు ఓపీకి ఎంత మంది వస్తారని ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రంలో ఓపీ రిజిస్టర్‌, ల్యాబ్‌, వ్యాక్సిన్లు, ఇమ్యూ నైజేషన్‌ గది, ఇన్‌ పేషెంట్‌ గదులు, ఇతర గదులు, ఫార్మసీ, ఆసుపత్రి ఆవరణలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఏఎన్‌ఎంలతో మాట్లాడి క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ఏఎన్సీ రిజిస్ట్రేషన్లు, గర్భిణీల ఆరోగ్య విషయాలపై దృష్టి సారిం చి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచేలా కృషి చేయాలని సూచించారు. ఎన్‌సీడీ స్ర్కీనింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించా రు. దీని ద్వారా ముందు గానే వ్యాధి లక్షణాలను గుర్తించి, అవసరమైన చికిత్స అందించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సీజనల్‌ వ్యాధులు, పరిసరాల పరిశు భ్రతపై వివరించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణం, పరిసరా లు శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని ఆదేశించారు.

Updated Date - Nov 19 , 2026 | 11:58 PM